టాటూ వేయించుకున్నవెంటనే ఎటువంటి వర్కవుట్లు చేయకూడదు.ఎందుకంటే చెమట పట్టడం వల్ల టాటూకలర్‌పోయే అవకాశం ఉంది. కొత్తలో వేడి తగలడం వల్లకూడా కొన్ని సమస్యలువస్తాయి. అందుకని స్పా,స్టీమ్ బాత్ వంటి వాటికి కనీసం మూడురోజులపాటుదూరంగా ఉండాలి.టాటూ వేయించుకున్న భాగాన్ని పుండుపూర్తిగా మానేవరకు ప్రతిరోజూయాంటీసెప్టిక్ క్లీనర్‌తో నాలుగుసార్లుతుడుస్తుండాలి. ఇలా ఆ పుండు పూర్తిగామానేవరకు చేస్తే ఇన్‌ఫెక్షన్లుదరిచేరవు. అలాగే దురద అనిపిస్తే మాయిశ్చరైజర్‌నిరాసుకుంటుండాలి. కలబందగుజ్జు రాసుకోవడం వల్ల కూడా దురద రాకుండా ఉంటుంది.టాటూ పచ్చిగా ఉన్నన్ని రోజులు ఎండ తగలకుండా జాగ్రత్తపడాలి. సన్‌స్ర్కీన్‌క్రీముల్లోనికెమికల్స్ టాటూ రసాయనాలతో కలవడం వల్ల అలర్జీవంటివి వచ్చేఆస్కారం ఉంది. అందుకేబయటకి వెళ్లినప్పుడు టాటూపై సన్‌స్ర్కీన్‌రాసుకోకూడదు. కొద్దిగా ఆలివ్ ఆయిల్, తేనె,వేపాకు రసం కలిపి టాటూ పుండుపైరాసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆభాగంలో ఇన్‌ఫెక్షన్ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది.
టాటూల తర్వత కసరత్తులు వద్దు
Related tags :