DailyDose

ఫినాయిల్ తాగిన ప్రముఖ నటి-నేరవార్తలు

Crime News - Kannada Actress Chitra Kotturu Attempts Suicide

* ప్రముఖ కన్నడ నటి, బిగ్​బాస్ షోలో పాల్గొన్న చైత్ర కొట్టూరు ఆత్మహత్యాయత్నం చేశారు. కోలార్​లోని తన ఇంట్లో ఫినాయిల్ తాగారు. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆమె ఇటీవలే(మార్చి 28న) నాగార్జున అనే వ్యాపారవేత్తను ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.అయితే వీరి వివాహ బంధంలో వివాదాలు తలెత్తాయని చర్చనడుస్తోంది.ఆమెను వివాహం చేసుకోవటం నాగార్జునకు ఇష్టం లేదని.. చైత్ర బలవంతం చేసిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.బిగ్ బాస్ కన్నడ సీజన్-7లో పాల్గొన్న చైత్ర కొట్టూరు.. సుజీదార అనే సినిమాలో సహాయక పాత్రలో నటించి మెప్పించారు.

* రాష్ట్ర సమస్యలపై వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో ఏనాడైన గట్టిగా మాట్లాడారా? అని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు.తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. జగన్‌ను జైలులో పెడతారనే భయంతోనే వైకాపా ఎంపీలు మాట్లాడలేక పోతున్నారన్నారని ఆరోపించారు.కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే జగన్‌ ఆలోచన అని విమర్శించారు.చంద్రబాబు హయాంలోనే తిరుపతిలో అభివృద్ధి జరిగిందని, వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా?అని నిలదీశారు.ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

* గుంటూరు జిల్లా అమరావతి మండలం, ఉంగుటూరులో వైసీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు.గ్రామంలో సిమెంట్ బెంచ్‌లను ద్వంసం చేశారు.పంచాయతీ ఎన్నికలలో ఓటమితోనే దాడులకు పాల్పడ్డారు.గ్రామంలోని వీధుల్లో ఉన్న 30 బెంచ్‌లలో 23 బెంచ్‌లను ధ్వంసం చేశారు.

* చంద్రబాబు, లోకేష్ లపై డీజీపీ కి వైసీపీ నేతల పిర్యాదు..డీజీపీని కలిసి పిర్యాదు చేసిన ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే లు మెరుగు నాగార్జున, కైలే అనిల్..తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుముర్తిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారని ఫిర్యాదు..

* గుంటూరు జిల్లా ఐనవోలు పోలీస్స్టేషన్లో లో ఆశీగా పనిచేస్తున్న బి.చంద్రశేఖర రావు (55) శుక్రవారం గుండెపోటుతో మరణించారు.

* విద్యాబుద్ధులు నేర్పవలసిన అధ్యాపకులే పరీక్షా ప్రశ్న పత్రాన్ని లీకు చేసి ఘటన గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల సెకండ్‌ షిఫ్ట్​ పాలిటెక్నిక్‌ కళాశాలలో చోటుచేసుకుంది.

* అహ్మదాబాద్​లోని అంకుర్​ పాఠశాలలో మంటలు చెలరేగాయి. నలుగురు చిన్నారులు.. పాఠశాల భవనంలో చిక్కుకున్నారు.