తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంత(PA,WV,DE) ప్రవాస తెలుగువారిని తానాతో మమేకం అయ్యేలా కృషి చేస్తానని ఈ ప్రాంతానికి తానా ప్రతినిధిగా నిరంజన్ శృంగవరపు ప్యానెల్ నుండి పోటీ చేస్తున్న జాస్తి శశిధర్ TNIతో అన్నారు. తానా ఆధ్వర్యంలో సేవా, వినోద, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటానని ఆయన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. UKలో మాస్టర్స్ విద్యనభ్యసించి 2004లో అమెరికాకు వచ్చిన శశిధర్ 2014నుండి తానాలో టీంస్క్వేర్ వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు. పెన్సిల్వేనియాలోని మెకానిక్స్‌బర్గ్‌లో నివసించే శశిధర్ ఆ ప్రాంతంలో తానా ద్వారా CPR శిబిరాలు తొలిసారిగా నిర్వహించారు. హారిస్‌బర్గ్ తానా 5కె రన్, సభ్యుల సేవల కమిటీ, కమ్యూనిటీ సేవల కమిటీ వంటివాటికి ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. HARI (Hindu American Religious Institute) కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా గత మూడేళ్లుగా సేవలందిస్తున్నారు. హారిస్‌బర్గ్ సాయి సేవా సమితికి గత నాలుగేళ్లుగా కోశాధికారిగా, HSSSకు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గుంటూరుజిల్లా కొప్పర్రుకు చెందిన శశిధర్ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. తనను మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధిగా గెలిపించవల్సిందిగా ఆయన ప్రవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఆదివారం పెన్సిల్వేనియాలో జరిగే నిరంజన్ ప్యానెల్ ప్రచార కార్యక్రమానికి ప్రవాసులు విరివిగా హాజరు అయి తమ ప్యానెల్‌ను బలపరచాలని కోరారు.
మిడ్-అట్లాంటిక్ ప్రవాసులతో తానాను మమేకం చేస్తా-TNIతో జాస్తి శశిధర్
Related tags :