‘‘కామాటిపురాలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగు ఉంటుంది. గౌరవంతో బతకాలి.. ఎవ్వరికీ భయపడకూడదు. నేను గంగూ బాయి.. ప్రెసిడెంట్ కామాటిపురా. మీరు కుమారి అంటూనే ఉన్నారు… నన్ను ఎవరూ శ్రీమతిని చేసిందే లేదు’’ వంటి డైలాగ్స్ ‘గంగూబాయి కాఠియావాడీ’ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధానపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూబాయి కాఠియావాడీ’. జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వేశ్యా గృహం నడిపే యజమాని గంగూబాయిగా నటిస్తున్నారు ఆలియా భట్. కాగా ‘వకీల్ సాబ్’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ‘గంగూబాయి కాఠియావాడీ’ తెలుగు టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగారు? అనేదే సినిమా ప్రధానాంశం. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ‘గంగూబాయి కాఠియావాడీ’ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రల్లో కనిపించనున్నారుఆలియా @ ప్రెసిడెంట్ ఆఫ్ కామాటిపురా
నాయకురాలిగా వేశ్య
Related tags :