Sports

నేను గూండాని

Rahul Dravid Calls Himself Gunda In Indranagar Circle

ప్రశాంతతకు మారు పేరైన భారత క్రికెటర్లలో రాహుల్‌ ద్రవిడ్‌ ముందువరుసలో ఉంటారు. అలాంటి ద్రవిడ్‌ ఓ నగరం నడి బొడ్డున.. ట్రాఫిక్‌లో.. కార్లోంచి లేచి.. ఇంద్రానగర్‌ గూండానురా నేను.. అంటూ బిగ్గరగా అరుస్తూ హల్‌చల్‌ చేశాడంటే మీకు నమ్మకం లేదుకదూ. నమ్మక్కర్లేదు లెండి.. ఇదంతా ఓ క్రెడిట్‌కార్డ్‌ యాప్‌ వ్యాపార ప్రకటన కోసమే! రాహుల్‌ ద్రవిడ్‌లో కూడా కోపం అనే కోణం ఉంటుందని ఈ ప్రకటనలో చెబుతూ నెక్స్ట్‌ షాట్‌లో రాహుల్‌ ట్రాఫిక్‌లో జనంపై అరుస్తున్నట్టు చిత్రీకరించారు. బ్యాట్‌ పట్టుకుని ద్రవిడ్‌ కారు అద్దాలు పగలగొట్టడం చూస్తుంటే.. ద్రవిడ్‌లో ఓ మంచి నటుడు ఉన్నాడని ఒప్పుకోక తప్పదు. ఇక ద్రవిడ్‌ అభిమానులు ఈ ప్రకటన చూసి ఓవైపు ఆశ్చర్యపోతూ మరోవైపు ఆనందపడుతున్నారు. భారత ఆటగాళ్లు కోహ్లీ, నటరాజన్‌లు ట్విటర్‌లో ఈ వీడియోను షేర్‌ చేసుకున్నారు. కాగా, ఈ ఐపీఎల్‌లోనూ శాంసన్‌, పడిక్కల్‌, పంత్‌ వంటి ద్రవిడ్‌ శిష్యులు అదరగొట్టే ప్రయత్నంలో ఉన్నారు.