ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాకిచ్చింది. రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరను ఏకంగా రూ.50కి పెంచింది. రాష్ట్రంలో, దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ ప్రభావం తమపై పడకుండా రైల్వే శాఖ తగిన జాగ్రత్తలు చేపట్టింది. దానిలో భాగంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైల్లలో అనవసర ప్రయాణాలను తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.50కి పెంచింది. గతంలో ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ. 10, 30 ఉండేది. కరోనా నేపథ్యంలో రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంపు
Related tags :