టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ కంటే కేసీఆర్ వైరస్ డేంజర్ అని ఎద్దేవా చేశారు. శాసనసభను రేవ్ పార్టీగా మార్చింది సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం రెండోసారి సీఎం కేసీఆర్ సభ అంటేనే ఓటమిని ఒప్పుకున్నట్టేనని చెప్పారు. జానారెడ్డి గెలుపు ఆయన కంటే తెలంగాణ ప్రజలకే అవసరమని చెప్పారు. కల్లు కంపౌండ్లా మారిన అసెంబ్లీలోకి జానారెడ్డి ఎంట్రీ అవసరముందన్నారు. టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతు వెనుక కమర్షియల్ కోణం ఉందని చెప్పారు. బీజేపీలో బండి సంజయ్, కిషన్రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని చెప్పారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవొద్దని బీజేపీ చూస్తోందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
కరోనా కంటే కేసీఆర్ ప్రమాదకరం
Related tags :