ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ప్లవనామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి సభ్యులకు, ప్రవాసులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది పండగ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనదని, ఉగాది పచ్చడి మనకు ఎదురయ్యే కష్టసుఖాలను ఒకేలా స్వీకరించాలని తెలుపుతుందని పేర్కొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. గాయని తేజస్విని విభావరి, చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. పండితులు రాఘవేంద్ర శర్మ సోమరాజుపల్లి, రవి కుమార్ తేటేటి, గణేష్ పూజ, అమ్మవారి పూజ, పంచాంగ శ్రవణం నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వెంకట్ కొర్రపాటి వ్యవహరించారు. కార్యక్రమంలో తానా తదుపరి అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, సెక్రటరీ రవి పొట్లూరి, కల్చరల్ కో – ఆర్డినేటర్ సునీల్ పంత్ర, మిడ్ అట్లాంటిక్ రీజియన్ కో – ఆర్డినేటర్ సతీష్ చుండ్రు, పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల, కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెంకట్ మేకపాటి సహకరించారు.
ఘనంగా తానా ప్లవనామ ఉగాది
Related tags :