వేపలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికే కాదు…మేనుకీ మేలు చేస్తాయి. అదెలాగంటే…
గుప్పెడు వేపాకులను నీళ్లలో వేసి.. పచ్చగా మారేంతవరకు మరిగించాలి. ఈ నీటిని సీసాలో నిల్వ చేసుకోవాలి. స్నానానికి ముందు నీటిలో కలిపితే దురదలు తగ్గుతాయి.
*వేపాకులను మరిగించిన నీటిలో దూది ఉండను ముంచి దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలూ, మచ్చలూ మాయం అవుతాయి. ఈ ఆకులను మెత్తగా నూరి చిటికెడు పసుపు కలిపి మొటిమలు, మచ్చలు ఉన్నచోట రాస్తే అవి క్రమంగా కనిపించవు.
వేపతో మెరిసే చర్మం
Related tags :