NRI-NRT

స్వస్థలానికి రెండేళ్ల కిందటి తూగో ప్రవాసుడి మృతదేహం

Two Year Old East Godavari NRT Dead Body Sent Back From Malaysia

* మలేషియాలో తూర్పు గోదావరి జిల్లా వాసి మృతి
* చనిపోయిన రెండు సంవత్సరాల తరువాత ఇంటికి చేరుకున్న మృతదేహం
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన కాయల సురేష్ రెండు సంవత్సరాల క్రిత్రం మలేషియా కోలాలంపూర్ లోని PPUM యూనివర్సిటీ ఆసుపత్రిలో న్యూమోనియాతో 06/02/2019న మృతిచెందాడు.

ఈ విషయం ఆసుపత్రి సిబ్బంది చాలా ఆలస్యంగా ఇండియన్ ఎంబసీకి తెలపడంతో వారు మలేషియా తెలంగాణ సంఘానికి(మైటా) APNRTకి తెలిపారు. మైటా ఉపాధ్యక్షుడు బూరెడ్డి మోహన్‌రెడ్డి మృతుడి కుటుంబానికి సమాచారాన్ని అందించి అవసరమైన దస్తావేజులు సేకరించి మంగళవారం నాడు ఇండియకు సురేష్ మృతదేహాన్ని పంపించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఖర్చులను మలేషియాలోని భారత ఎంబసీ భరించినట్లు మోహన్‌రెడ్డి తెలిపారు. APNRT విమానాశ్రయం నుండి సురేష్ గ్రామానికి రవాణా సదుపాయాన్ని కల్పిస్తోంది. మైటా అధ్యక్షుడు సైదం తిరుపతి ఈ కార్యక్రమ సమన్వయకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.