* బెంగళూరులో శ్మశానాలన్నీ ఫుల్.రుద్రభూముల్లో మృతదేహాల క్యూలు.బెంగళూరు: బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది.కోవిడ్ సోకి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.శ్మశానాల వద్ద మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి.బెంగళూరులో కోవిడ్ సోకి నిత్యం 50 మంది వరకూ మరణిస్తున్నారు.నగరంలోని 5 శ్మశానాల్లో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు.
* గన్నవరం విమానాశ్రయానికి మరో 5 లక్షల కొవిడ్ వ్యాక్సిన్..పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులు..తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి చేరిక..అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనున్న వ్యాక్సిన్..తరలిరానున్న టీకాతో రాష్ట్రంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం.
* కృష్ణ జిల్లా, గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం.ఓ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ..నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలకు ఇన్ ఛార్జ్ గా ఉన్న సదరు ఉన్నతాధికారి..ఆందోళనలో సమస్యల పరిష్కారం కోసం వచ్చి కలిసిన ప్రజలు, సిబ్బంది..శుక్రవారం ఒక్కరోజే గన్నవరం మండలంలో పది మందికి వైరస్ నిర్ధరణ..అప్రమత్తమైన వైద్య, పంచాయతీ సిబ్బంది..
* దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. వరుసగా మూడో రోజు కొవిడ్ కేసులు రెండు లక్షలకు పైనే నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో దేశంలో 14.95లక్షల టెస్టులు చేయగా 2,34,692 కేసులు బయటపడ్డాయి.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరింది.కొత్తగా 1,23,354 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,26,71,220 చేరి.. రికవరీ రేటు 87.80 శాతంగా ఉంది._ఇక రెండో దశలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రోజుకు వెయ్యి మందికి పైనే కరోనాకు బలవుతున్నారు.తాజాగా 1,341 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.దీంతో కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దాని బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,75,649కు చేరింది.
* కొత్త కోవిడ్ (స్టైయిన్) యొక్క 7 లక్షణాలు:1. భరించలేని నొప్పులు2. కండ్లకలక, కళ్ళు ఎర్రబారడం3. చర్మం మీద దద్దుర్లు4. భరించలేని తలనొప్పి5. చేతి లేదా కాలి వ్రేళ్ళు రంగు మారుట6. నీళ్ల విరేచనాలు7. గొంతు నొప్పిదయచేసి ప్రతి ఒక్కరూ విథిగా మాస్కులు ధరించుట, శానిటైజర్ రాసుకొనుట, భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారి పై మరొకమారు యుద్ధాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని తయారు చేద్దాం… సంసిద్ధంకం *కరోనా హెచ్చరిక:ప్రజా ప్రయోజనాల రీత్యా జారీ చేయబడింది.కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు 2 వ దశలో ఉందని, సోకిన 3 రోజులలోనే తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.
* తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది.రోజు రోజుకు భయంకరంగా మారుతోంది.గాంధీ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది.ప్రతి పది నిమిషాలకు ఓ కరోనా పేషెంట్ గాంధీ ఆసుపత్రిలో చేరుతున్నాడు.ఆసుపత్రిలోని వెంటిలేటర్ బెడ్స్ అన్ని నిండిపోయాయి.కాగా సెకండ్ వేవ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ అన్నారు.ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు.
* ‘రియల్ హీరో’, ప్రముఖ నటుడు సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీటర్ ద్వారా వెల్లడించారు. ‘ఈ రోజు ఉదయం కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలింది. ముందుజాగ్రత్తగా చర్యగా నేను ఇప్పటికే సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎవరూ ఆందోళన చెందవద్దు. దీనివల్ల మీ సమస్యల పరిష్కారం కోసం నాకు చాలా సమయం దొరుకుతుంది. నేను మీ అందరివాడిని అనే విషయం గుర్తుపెట్టుకోండి’అని సోనూసూద్ ట్వీట్ చేశాడు.