Politics

2కిలోల బరువు తగ్గిన షర్మిల

YS Sharmila Sugar Levels Low And Lost Two Kilos

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ దీక్ష చేస్తున్న దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్‌ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది. లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగిస్తున్న షర్మిలను వైద్యులు పరీక్షించారు. షుగర్‌ లెవల్స్‌ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు ఆమెను పరీక్షించిన డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ 72 గంటల దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ వద్ద దీక్ష చేపట్టారు.