టెక్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్న వేలాది కుటుంబాలకు చెందిన హ్యూస్టన్ ప్రవాసులు తెలుగుజాతి గర్వపడే విధంగా ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. హ్యూస్టన్‌లో భారీ స్థాయిలో 35ఎకరాల విస్తీర్ణంలో తెలుగు భవనాన్ని నిర్మించడానికి నడుం బిగించారు. ఈ భవనంలో తెలుగుజాతి చరిత్ర ప్రతిబింబించే విధంగా ప్రదర్శనతో పాటు ఒక కమ్యూనిటీ హాలు, క్రీడా మైదానం, వ్యవసాయ క్షేత్రం తదితర వాటిని నిర్మించడానికి నడుం కట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం గత ఆదివారం నాడు శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రవాసులు, దాతలు కలిసి భూమిపూజ చేశారు. హ్యూస్టన్‌లో నివసిస్తున్న వారితో పాటు పరిసర ప్రాంత తెలుగు వారు కూడా ఈ భవన నిర్మాణానికి చేయూతనందిస్తున్నారు. తెలుగు వారు గర్వించే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు తానా మాజీ అధ్యక్షురాలు ముత్యాల పద్మశ్రీ తెలిపారు.
హ్యూస్టన్ తెలుగు ప్రవాసుల భారీ ప్రాజెక్టు
Related tags :