ఆన్‌లైన్‌లో భద్రాచలం రామయ్య కళ్యాణ టికెట్లు–ఆధ్యాత్మికం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 14న జరిగే స్వామి వారి తిరు కల్యాణం, 15న జరిగే శ్రీరామ మహాపట్టాభిషేకానికి సంబంధించిన టికెట్లను నేటి నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు దేవస్థానం ఈవో టి. రమేష్‌బాబు తెలిపారు. కల్యాణం రోజున వీక్షించే భక్తుల సౌకర్యార్దం రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే పట్టాభిషేకం రోజుకు సంబంధించి రూ.250, రూ.100 టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు భద్రాచలం ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా రూ.5 వేల శ్రీరామనవమి కల్యాణం ఉభయదాతల టికెట్లు దేవస్థానం కార్యాలయంలో విక్రయిస్తున్నారని ఆసక్తి గల భక్తులు దేవస్థానం పనివేళలల్లో సంప్రదించాలని కోరారు. వివరాలకు 08743- 232428లో సంప్రదించాలని కోరారు.
1.శివయ్య పెళ్లికి.. వెంకన్న వస్త్రాలు
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున శ్రీకాళహస్తిలో జరిగే శివయ్య పెళ్లికి తిరుమలేశుడైన వేంకటేశ్వరస్వామి ఆలయం తరఫున తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దంపతులు బుధవారం పట్టువస్త్రాలను సమర్పించారు. తల్లిదండ్రులకు జరుగుతున్న వివాహ మహోత్సవానికి కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరఫున ఆ ఆలయ ఈవో పూర్ణచంద్రరావు కూడా పట్టువస్త్రాలను అందజేశారు.
2.వైభవంగా నూకతాత పండగ
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో నూకతాత సంబరం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. నూకతాత ప్రతిమలకు సముద్ర స్నానం చేయించిన భక్తులు అక్కడి నుంచి పూజారులతో కలిసి కాలినడకన ఊరేగింపుగా రాజయ్యపేటకు వచ్చారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా జనాలు రోడ్డుపై వస్త్రాలు పరిచి వాటిపై పడుకుని ఉండగా పూజారులు ఆశీర్వాదం అందిస్తూ వారి మీదుగా నడిచి వెళ్లారు. ఈ వేడుకను తిలకించడానికి వివిధ గ్రామాల నుంచి జనం భారీగా తరలివచ్చారు.
3. అంతర్జాలంలో భద్రాచలం కల్యాణ టికెట్లు
భక్తులకు సీతారాముల కల్యాణోత్సవ టికెట్లను అంతర్జాలంలో విక్రయిస్తున్నారు. భద్రాచలం ఆలయంలో ఏప్రిల్‌ 6 నుంచి 20 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇప్పటికే రూ.5,000 వంతున విలువ గల ఉభయదాతల టికెట్ల విక్రయాలు దేవస్థాన కార్యాలయంలో జరుగుతున్నాయి. దూరప్రాంతాల్లో ఉన్న రామభక్తుల సౌకర్యార్థం అంతర్జాల సేవలను అందుబాటులోకి తెచ్చామని బుధవారం ఈవో రమేశ్‌బాబు తెలిపారు. కల్యాణానికి రూ.5 వేలు, రూ.2 వేలతో పాటు ఇతర టికెట్లనూ అంతర్జాలంలో ఉంచామని; వీటిని తీసుకున్నవారు వచ్చేనెల 14న సీతారామ కల్యాణాన్ని సెక్టార్‌లోకి వెళ్లి ప్రత్యక్షంగా దర్శించవచ్చని పేర్కొన్నారు. భక్తులు www.bhadrachalamonline.com ద్వారా టికెట్లు తీసుకోవచ్చన్నారు.
4. నేటితో కీసర బ్రహ్మోత్సవాలు ముగింపు
కీసర బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ముగింపు వేడుకలను నేడు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి తెలిపారు. ముగింపు వేడుకలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరవుతారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేయడంతో పాటు వివిధ సేవలందించిన అధికారులకు, సేవా సంస్థలకు ప్రశంస పత్రాలను అందించడం జరుగుతుందన్నారు.
5. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 55,009 మంది భక్తులు దర్శించుకున్నారు.
6. చరిత్రలో ఈ రోజు/మార్చి 7
1921 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు జననం (మ.1992).
1938 : అమెరికా దేశానికి చెందిన జీవశాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత డేవిడ్ బాల్టిమోర్ జననం.
1952 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్స్ జననం.
1952 : పరమహంస యోగానంద మరణం (జ.1893).
1961 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గోవింద్ వల్లభ్ పంత్ మరణం (జ.1887).
1970 : ఆంగ్ల నటి మరియు రూపకర్త రాచెల్ వీజ్ జననం
8. శుభమస్తు
తేది : 7, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(నిన్న రాత్రి 9 గం॥ 33 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 42 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాభద్ర
(నిన్న రాత్రి 6 గం॥ 12 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 52 ని॥ వరకు)
యోగము : సాధ్యము
కరణం : (కింస్తుఘ్న) కౌస్తుభ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 4 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 11 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 44 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 14 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 59 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 57 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 30 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 23 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : కుంభము
7. భద్రాచల రాముడి కల్యాణానికి ముహూర్తం ఖరారు!
భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఆలయ వేద పండితులు, అర్చకులు ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 20 వరకు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 14న సీతారాముల కల్యాణం, 15న మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం భక్తులు తిలకించేందుకు మిథిలా ప్రాంగణంలో సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.5 వేలు, రూ.2 వేలతోపాటు ఇతర టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించే భక్తులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
8.యునెస్కో రేసులో రామప్ప
ఎట్టకేలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రేసులో రామప్ప నిలిచింది. రెండేళ్లుగా వచ్చినట్టే వచ్చి చేజారిన అవకాశం ఈసారి దక్కింది. మనదేశం తరఫున చారిత్రక వారసత్వ కట్టడంగా రుద్రేశ్వరాలయాన్ని(రామప్పగుడి) కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎంపిక చేసింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్న యునైటెడ్‍ నేషన్స్ ఎడ్యుకేషన్‍, సైన్స్, కల్చరల్‍ ఆర్గనైజేషన్‍ (యూనెస్కో) ప్రపంచ వారసత్వ కట్టడాలను ఎంపిక చేస్తుంది. దీని కోసం ప్రతి దేశం రెండు ఎంట్రీలను పంపించాల్సి ఉంటుంది. ఒకటి నేచురల్‍ సైట్‍, రెండోది చారిత్రక కట్టడం. ఈ ఏడాది భారత్‍ తరఫున రామప్పగుడిని పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గతంలో సైతం రామప్ప గుడిని భారతదేశం తరఫున ఎంట్రీగా పంపేందుకు ప్రయత్నాలు జరిగాయి. 2017లో గుజరాత్‍, 2018లో రాజస్థాన్ లోని జైపూర్‍ నగరంలో ఉన్న కట్టడాలు భారత్‍ తరఫున‍ అధికారిక ఎంట్రీలుగా యూనెస్కోకు వెళ్లాయి. ఆ రెండు సందర్భాల్లో రామప్ప రాష్ట్ర సరిహద్దులు దాటినా దేశ సరిహద్దులు దాటలేకపోయింది. దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఏడాది ఎంట్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో కేంద్ర స్థాయిలో రామప్ప ఎంట్రీకి మద్దతు లభించింది. ఫలితంగా భారత్‍ తరఫున అధికారిక ఎంట్రీగా యూనెస్కో తలుపులు తట్టనుంది.
*ఐకోమాస్‍ నివేదిక
భారత్‍ తరఫున అధికార ఎంట్రీగా రామప్ప యూనెస్కో పరిశీలనకు వెళ్లిన నేపథ్యంలో తర్వలో యూనెస్కో ఓ విభాగమైన ఐకోమాస్‍ (ఇంటర్నేషనల్‍ కౌన్సిల్‍ అన్‍ మాన్యుమెంట్స్ అండ్‍ సైట్స్ ) బృంద సభ్యులు ఇక్కడకు రానున్నారు. రామప్ప ఆలయ విశిష్టతలు, చారిత్రక నేపథ్యం , నిర్మాణ పరిరక్షణకు తీసుకున్న జాగ్రత్తలు వారు పరిశీలిస్తారు. వాటిని ప్రపంచంలో ఉన్న ఇతర నిర్మాణాలు, అక్కడి కాలమాన పరిస్థితులు తదితర అంశాలతో నివేదిక రూపొందిస్తారు. ఐకోమాస్‍ ప్రతినిధులు ఇచ్చే నివేదిక ఆధారంగా యూనెస్కో గుర్తింపు లభిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యేందుకు నాలుగైదేళ్లు పడుతుంది. నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యం , శిల్పాల విశిష్టత వంటి అంశాల్లో రామప్పకు ఎదురులేదు. ఇక ఆలయ పరిరక్షణకు సంబంధించి ఆలయం నుంచి వంద మీటర్ల దూరం వరకు ప్రొహిబిటెడ్‍ జోన్‍, అక్కడి నుంచి మరో 200 మీటర్లు రిస్ట్రిక్టెడ్‍ జోన్ గా ఉండాలి. ప్రస్తుతం రామప్ప చుట్టూ వంద మీటర్ల దూరంలో ఉన్న ఉన్న వాణిజ్య సముదాయాలు తాత్కాలిక నిర్మాణాలు. ఆ తర్వాత రెండు వందల మీటర్ల పరిధిలో పదుల సంఖ్యలో ఇళ్లు ఉన్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
*2012నుంచీ ..
కాకతీయ కట్టడాలకు యునెస్కో గుర్తింపు సాధించేందుకు 2012 నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. తొలిసారిగా 2012 చెన్నైలో జరిగిన సదరన్‍ రీజియన్ కాన్ఫరెన్సు ఆన్‍ వరల్డ్ హెరిటేజ్‍ సదస్సులో కాకతీయుల కట్టడాలైన వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్‍, రామప్ప ఆలయాలను ప్రతిపాదించారు. ఆ తర్వాత 2015 ఏప్రిల్లోట న్యూ ఢిల్లీలో జరిగిన వరల్డ్ హెరిటేజ్‍ సైట్‍ వర్క్ షాప్ లో సానుకూల స్పందన వచ్చింది. ఆ తర్వాత ఏడు వరల్డ్ హెరిటేజ్‍ సైట్స్ టెంటే టీవ్‍ లిస్ట్ 2016లో కాకతీయ కట్టడాలకు చోటు లభించింది. యునెస్కో నిబంధనల ప్రకారం వరల్డ్ హెరిటే జ్‍ సైట్స్ చుట్టుపక్కల మూడు వందల మీటర్ల దూరం వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండరాదనే కఠిన నిబంధన దృష్టిలో ఉంచుకుని ఫైనల్‍ లిస్ట్ నుంచి వేయి స్తంభాల దేవాలయం, ఖిలావరంగల్నుష తొలగించారు. ఆ తర్వాత 2017, 2018లో భారత్‍ తరఫున అధికార ఎంట్రీగా పంపేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ రెండు సందర్భాల్లో కేంద్రం ఓసారి గుజరాత్‍, మరోసారి రాజస్థాన్ లకు అవకాశం కల్పించింది. తెలంగాణ తరఫున ఇప్పటి వరకు వరల్డ్ హెరిటే జ్‍ సైట్గాా గుర్తింపు ఉన్న ఒక్క చారిత్రక కట్టడం లేదు. ఈ నేపథ్యం లో తొలిసారి రామప్పకు ఆ అవకాశం వచ్చింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com