భారతీయులకు బ్రిటన్ కొంపలపై ఆసక్తి

భారత సంపన్నుల్లో ఎక్కువ శాతం మంది బ్రిటన్‌లో కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తాజా సర్వే ఒకటి పేర్కొంది. బ్రిటన్‌లో ఆస్తుల కొనుగోలుకు 74 శాతం మంది ధనవంతులు; అమెరికాలో ఇల్లు కొనడానికి 39 శాతం మంది భారత సంపన్నులు(అల్ట్రారిచ్‌) మొగ్గుచూపుతున్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ తన ‘వెల్త్‌రిపోర్ట్‌-2019’లో వెల్లడించింది. ఆయా దేశాల్లోని సేవల నాణ్యతకు వీరు ఫిదా అయిపోయారని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజల్‌ పేర్కొన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆస్తులను కొనుగోలు చేస్తూ.. అంతర్జాతీయ సంపద సృష్టిలో భారతీయులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సర్వేలోని ఇతరముఖ్యాంశాలు..వ్యాపారం చేయడానికే కాదు.. ఆస్తుల కొనుగోలుకు, విశ్రాంతి తీసుకోవడానికి కూడా బ్రిటన్‌, అమెరికాల వైపు భారతీయ సుసంపన్నులు ఆసక్తి చూపుతున్నారు.79 శాతం మంది ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి బ్రిటన్‌ను ఎంచుకుంటున్నారు. కొత్త ఇల్లు కొనడానికి ఆస్ట్రేలియా(13%), కెనడా(16%), సింగపూర్‌(19%)లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.తొలి, రెండో ఇల్లుతో పాటు పెట్టుబడులను పెట్టడానికి ఆస్ట్రేలియా, సింగపూర్‌లను ఎంచుకుంటామని 14% మంది; కెనడాపై దృష్టి సారిస్తామని 10% మంది చెబుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com