తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్(TAS) 19వ వార్షికోత్సవ ఉగాది వేడుకలను ఆదివారం నాడు వర్చ్యూవల్‌గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్ మైధిలి కెఒబూరి దీపారాధనతో ప్రారంభించారు. సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్ నూక కోవిద్ కారణంగా అంతర్జాలంలో ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియా విభాగ కార్యదర్శి విజయకుమార్ పర్రి ప్రముఖ నటుడు బాబుమోహన్‌ను సభకు పరిచయం చేశారు. బాబూమోహన్ తన సినీ, రాజకీయ ప్రస్థానంపై ప్రసంగించారు. సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. TAS అధ్యక్షుడు చింపిరి శివ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపి గత ఏడాది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. మహిళా విభాగ కార్యదర్శి మాధవి లత సైకిల్ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. “మనబడి” విద్యార్థుల “మా తెలుగు తల్లికి” గేయ ఆలాపన ఆకట్టుకుంది. కార్యదర్శి కె.ఉదయ్‌కుమార్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
స్కాట్‌ల్యాండ్‌లో ఉగాది వేడుకలు
Related tags :