* 1500కు పైగా అతిథుల రాకతో నాట్స్ 6వ తెలుగు సంబరాలు ప్రారంభం
* బ్యాంక్వెట్‌లో పసందైన విందు భోజనం
* పలు రంగాల్లో నిష్ణాతులకు పురస్కారాలు
* అలరించిన ఆర్పీ పట్నాయిక్ సంగీత విభావరి
* రాజకీయ రొచ్చు లేకుండా రంజుగా అలరించిన కార్యక్రమాలు
“మనమంతా తెలుగు – మనసంతా వెలుగు” నినాదానికి పట్టం కడుతూ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర డల్లాస్-ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో 6వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం(భారతీయులకు శనివారం తెల్లవారుజామున) బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయగిరి రాజేశ్వరి వ్యాఖ్యాత్రిగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ప్రేం కలిదిండి స్వాగతోపన్యాసంతో ప్రారంభమయింది. మాజీ రాజ్యసభ సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఇర్వింగ్ మేయర్ రిక్ స్టోఫర్ జ్యోతి ప్రజ్వలన చేసి మే 24వ తేదీని ఇర్వింగ్ నగరంలో నాట్స్ రోజుగా ప్రకటించారు. ఈ 6వ అమెరికా తెలుగు సంబరాల చైర్మన్ కంచర్ల కిషోర్ మాట్లాడుతూ నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్, డైరక్టర్ల బోర్డు చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, సోదరసమానుడు అప్పసాని శ్రీధర్, ఎందరో దాతలు, మరెందరో వాలంటీర్ల సమిష్ఠి కృషి మూలంగానే ఈ వేడుకలు జీవం పోసుకున్నాయని ధన్యవాదాలు తెలిపారు. స్థానిక చిన్నారులు, యువతీయువకుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కాజా గ్రామంలో 5ఎకరాల విస్తీర్ణంలో అనాధ ఆడపిల్లలను చేరదీసి చిన్మయ విద్య ద్వారా సామాజిక సేవ చేస్తున్న మిషిగన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా.ముక్కామల అప్పారావును ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అప్పారావు మాట్లడుతూ 106మంది పిల్లలు కలిగిన ఈ ఆశ్రమంలో 20మంది ప్రస్తుతం కాలేజీలో చదువుతున్నారని, గుత్తికొండ శ్రీనివాస్, కిషోర్ కంచర్ల లాంటి దాతల సహకారానికి తాను సదా ఋణపడి ఉంటానని తెలిపారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో రూపొందించిన సావనీర్‌ను నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. బాపు నూతి అతిథులను, సినీనటులను సభకు పరిచయం చేశారు. గెల్లి ఆది సభ నిర్వహణకు విరాళాలు అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలు రంగాల్లో విశేష సేవలందించిన ఈ దిగువ ప్రముఖులకు నాట్స్ పురస్కారాలను అందించారు. అవార్డుల కమిటీ చైర్మన్ రవీంద్ర ఆధ్వర్యంలో నాట్స్ కార్యవర్గ సభ్యులు డా.కొర్రపాటి మాధు నేతృత్వంలో ఈ పురస్కారాలు అందజేశారు. ఆర్పీ పట్నాయిక సంగీత విభావరి అతిథులను ఉర్రూతలూగించింది. సినీనటులు సాయి ధరం తేజ, సాయికుమార్, రచయితలు రామజోగయ్య శాస్త్రి, సిరాశ్రీ, భాస్కరభట్ల, రాజేష్, నటీమణులు మన్నారా చోప్రా, భానుశ్రీ, ప్రియ, నీలియా భవానీ, గీతా, మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, జితేంద్ర, గిరిధర్, జెమిని సురేష్, సంగీత దర్శకులు కీరవాణి, మనో తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కౌజుపిట్ట మాంసం, జింక వేపుడు, పిడత కింద పప్పు వంటి వినూత్న వంటకాలు అహోమనిపించాయి.
1. Suresh Ediga, Social Justice and community service. from NJ, Telugu farmers suicide initiative and I4farmers blog and has been working both in AP and Telangana
2. Ravi Kantamsetty, Social service and Humanitarian award, Dallas, TX, founder and president of Ashajyothy foundation a service organization to the underprivileged children of India.
3. Srikanth and Laxmi Bojja family for community service, from Chicago, IL, several service activities including helping the homeless in Chicago area
4. Satish Tanikonda, from Chicago, IL, for social service.
5. Krishna Kishore Mallina, Community service, LA, Mallina foundation and several activities in his home town.
6. Arun Ayyagari, PA, Community Service, Aerospace Engineer, promoting educational programs and community service
7. Dr. Subba Raju Krosuri, TX, Community service award
8. Pranati Pillutla, TX, Academic excellence award
9. Dr. Suresh Kankanala, TX, award for medical service to the poor
10. Venkanna Chowdary Yarlagadda, Chairman GLOW foundation, Community service excellence
11. Venkata Chintalapati, Academic achievement award
12. Shankaramanchi Raghu Sharma, Spiritual Service via Sri Shirdi Sai Dattha Peetham New Jersey
చదవండి: మూడురోజుల నాట్స్ సంబరాల పూర్తి షెడ్యూల్‌తో పాటు మరింత నాట్స్ సమాచారం
Tags:nats 2019, nats, nats north america telugu society 6th america telugu sambaralu irving dallas texas usa america convention banquet start gallery news videos,nats 2019 irving convention, nats 2019 6th america telugu sambaralu, nats telugu convention in dallas, nats 2019 conference irving dallas texas usa, nats conference america, nats convention america 2019, nats sambaralu today, nats banquet, nats 2019 banquet, nats 2019 gallery, north america telugu society nats 2019 america telugu sambaralu, nats 2019 sambaralu, nats north america telugu society schedule, nats 2019 irving 6th conference events today