ఆభరణాలు కొనేవారికి శుభవార్త-వాణిజ్య-03/11

*అధిక విలువ కలిగిన కార్లు, నగలు కొనుగోలు చేసేవారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ మండలి (సీబీఐసీ) తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, రూ.10 లక్షల కంటే అధిక ధర కలిగిన కార్లు, రూ.5 లక్షల కంటే మించిన ఆభరణాలు, రూ.2 లక్షలకు మించిన బులియన్‌ (మేలిమి బంగారం) కొనుగోలు చేసిన వారి వద్ద 1 శాతం టీసీఎస్‌ (మూలం వద్దే పన్ను) వసూలు చేస్తున్నారు.
*దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా అమల్లోకి తీసుకొచ్చేందుకు తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేం తూ పధకం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది.
*ప్రభుత్వ రంగా బ్యాంకు ఒంజాబ్ న్మేశానల్ బ్యాంకు రుణాలపై వడ్డీరేటును తగ్గించింది.
*ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎంసిల్ఆర్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
*విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్‌ 2 పథకం కింద ఆయా వాహనాలకు ప్రోత్సాహకాలను ఏప్రిల్‌ 1 నుంచి అందించనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలు చేయనున్న ఈ పథకం కోసం రూ.10,000 కోట్లు కేటాయించిన సంగతి విదితమే. బస్సుల్లో ఈవీ టెక్నాలజీ కలిగినవి, ఎలక్ట్రిక్‌, ప్లగ్‌ఇన్‌ హైబ్రిడ్‌, పటిష్ట హైబ్రిడ్‌కార్లు, ఆటోలు, ఇ-రిక్షాలు, విద్యుత్తు ద్విచక్ర వాహనాలకు కూడా ప్రోత్సాహకాలు అందుతాయి. అన్ని వాహనాలకు మూడేళ్ల సమగ్ర వారెంటీ ఇవ్వడం తప్పనిసరి చేసినందున, అన్ని విడిభాగాల తయారీకి మంచి సంస్థలు ముందుకొస్తాయని భావిస్తున్నారు.
*పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు గతవారం రూ.32,550 వద్ద నష్టాలతో ఆరంభమైంది. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో కాంట్రాక్టు రూ.31,777 స్థాయికి పడిపోయింది. చివరకు 1.09% లాభంతో రూ.32,196 వద్ద కాంట్రాక్టు ముగిసింది. మరింత దిద్దుబాటు కావచ్చనే అంచనాల నేపథ్యంలో ఈవారం కూడా పసిడి కాంట్రాక్టు మరికొంత కిందకు వచ్చే అవకాశం ఉంది. రూ.31,986 స్థాయికి దిగివచ్చిన తర్వాతే కాంట్రాక్టు తిరిగి పుంజుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఈవారం వెలువడే అమెరికా కీలక ఆర్థిక గణాంకాలు, డాలరు కదలికలపై కూడా ట్రేడర్లు దృష్టి సారించడం మంచిది.
*డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం, చమురు ధరలు దిద్దుబాటుకు గురికావడంతో గత వారం మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చిన్న, మధ్య స్థాయి షేర్లకు కొనుగోళ్ల మద్దతు కొనసాగడం సెంటిమెంట్‌ను బలపరిచింది. అంతర్జాతీయ వృద్ధి భయాలతో ప్రపంచ మార్కెట్లు స్తబ్దుగా కదలాడాయి. చైనా ఎగుమతులు, అమెరికా ఉద్యోగ గణాంకాలు నిరాశపరిచాయి.
*దేశ, విదేశీ ప్రముఖుల ఆశీస్సులతో ఒక్కటైన ముకేశ్‌ అంబానీ తనయుడు ఆకాశ్‌ అంబానీ- రోజీ బ్లూ డైమండ్స్‌ సీఈఓ రసెల్‌ మెహతా తనయ శ్లోకా మెహతాల మంగళ్‌పర్వ్‌ వేడుక ఆదివారం సాయంత్రం ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో అట్టహాసంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు, ఇప్పుడు జీవిత భాగస్వామి అయిన శ్లోకా మెహతాను ఈ వేడుకలో అందరికీ పరిచయం చేశారు ఆకాశ్‌. ముంబయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో కొత్తగా నిర్మించిన ఈ కన్వెన్షన్‌ సెంటర్‌లో వివాహానంతర వేడుకలకు సినీ, పారిశ్రామిక, ఆర్థిక, రాజకీయ రంగాల ప్రముఖులంతా తరలి వచ్చారు.
*ఇప్పటివరకు ఐడీబీఐ బ్యాంకునకు మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్న రాకేష్‌ శర్మ మరో మూడేళ్లపాటు బ్యాంకు ఎండీ, సీఈఓగా కొనసాగే సూచనలు అవుపిస్తున్నాయి. అతని పదవీ కాలాన్ని పెంచే విషయాన్ని పరిశీలించేందుకు అంగీకరిస్తున్నట్లు ఐడీబీఐ బ్యాంకు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
*వివిధ కంపెనీలకు క్రెడిట్‌ రేటింగ్‌ను ఇవ్వటంతోపాటు, సలహాదారులుగా వ్యవహరిస్తూ.. రెండు విధాలుగా పనిచేస్తున్నటువంటి క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల ద్విపాత్రకు ఆర్బీఐ చెక్‌ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. ఇకపై ఆయా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు తమ ఖాతాదారుల క్రెడిట్‌ విషయంలో పక్షపాతంగా వ్యవహరించకుండా చూడటం, సదరు కంపెనీల ఆర్థిక పరిస్థితి వివరాలు, ఇతరత్ర వివాదాలు రాకుండా నిరోధించటం కోసం ఆర్బీఐ ఈ చర్య తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
*క్విజ్‌ పేరుతో దాదాపు 60వేల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులను ఉచ్చులోకి లాగిందో ద్వయం. వారి వద్ద నుంచి వ్యక్తిగత సమాచారం, ఫ్రెండ్స్‌ లిస్ట్‌, ఇతర సమాచారాన్ని సర్వర్ల నుంచి దొంగిలించారు. ఉక్రెయిన్‌లోని ఆండ్రీ గోర్బచేవ్‌, గ్లెబ్‌ స్లుచెస్కీ వెబ్‌సన్‌ గ్రూప్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. వీరు ఆన్‌లైన్‌ క్విజ్‌ పేరుతో కొన్ని రకాల బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్లు వినియోగదారుల ఫోన్లు, కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేశారు.
*అత్యధిక విలువ కలిగిన కార్లు, నగలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం కొంత ఊరటనిచ్చింది. వీరికి కొనుగోళ్ల సమయంలో విధించే 1శాతం టీసీఎస్‌(ట్యాక్స్‌ కలెక్షన్‌ ఎట్‌ సోర్స్‌)ను వస్తువుల విలువలో కలపటం నుంచి మినహాయించినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్‌ వెల్లడించింది. దీంతో రూ.10 లక్షలకు పైబడిన కార్లు, రూ 5లక్షలకు పైబడిన నగలు, రూ.2లక్షలకు పైబడిన బులియన్‌ కొనుగోళ్లపై ఉపశమనం లభించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com