యాదాద్రిలో బ్రహ్మోత్సవ సందడి

1. వైభవంగా యదాద్రి నరసింహుని బ్రహ్మోత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామి వారు ఉదయం మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చా రు. అర్చకులు, అధికారులు బాలాలయంలో ఊరేగించారు. ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించి ఉత్సవ ప్రాధాన్యతను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు యాదాద్రి ఆలయ అధికారులు తెలిపారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం వేళల్లో అలంకారసేవలు, రాత్రి వేళల్లో శ్రీవారి వాహనసేవలు ప్రతీ రోజు జరుగుతాయన్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ విశిష్ట అతిధిగా 15న ఉదయం కళ్యాణోత్సవానికి హాజరుకానున్నట్లు తెలిపారు.
2. ధ్వజారోహణం.. దేవతాహ్వానం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు శనివారం విశిష్ట పర్వాలను నిర్వహించారు. విశ్వమంతా సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ధ్వజారోహణం.. దేవతాహ్వాన క్రతువులను చేపట్టారు. పండితులు వేదాలను పఠిస్తుండగా ప్రధాన పూజారి గరుడ పూజలను నిర్వహించారు. గరుడ ఆళ్వారుడిని చిత్రించిన ధ్వజానికి యాగశాలలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. బాలాలయ ధ్వజస్తంభం చెంత ఈ పర్వం రెండు గంటలపాటు కొనసాగింది. రాత్రి ప్రత్యేక హవనాలు చేశారు. భేరీ పూజ, దేవతాహ్వానం వేడుకలను అష్టరాగాల ఆలాపనల మధ్య చేపట్టారు.
3. శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం దేవరాత్రిని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్ల ధ్వజావరోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత సోమస్కంధమూర్తి ఉత్సవమూర్తులను పట్టణ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తులకు వసంతోత్సవాన్ని నిర్వహించి, సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని వేదపండితులు వైభవంగా జరిపారు. దీంతో శ్రీకాళహస్తీశ్వరుని నవదిన బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి.
4. ఈసారి అమర్‌నాథ్ యాత్ర 46 రోజులు… ఏప్రిల్ 1నుంచి రిజిస్ట్రేషన్
అమర్‌నాథ్ యాత్ర ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాడు అంటే జూలై 1నుంచి ప్రారంభమై ఆగస్టు 15 వరకూ కొనసాగనుంది. ఈ యాత్ర మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. గత ఏడాది అమర్‌నాథ్ యాత్ర 60 రోజులు జరిగింది. ఈ సారి ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటివారం వరకూ రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 400కు మించిన బ్రాంచీల ద్వారా ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కాగా ఈసారి అమర్‌నాథ్ యాత్రకు మరింత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. అలాగే ఈసారి కూడా 13 ఏళ్ల కన్నా తక్కువ, 75 ఏళ్ల కన్నా ఎక్కవ వయసుగల వారికి యాత్ర చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. అలాగే ఆరు నెలలు దాటిన గర్భవతులు కూడా యాత్ర చేసేందుకు అవకాశం లేదు.
5. అరసవల్లి ఆదిత్యుడికి కిరణస్పర్శ
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం సూర్యకిరణ స్పర్శ ఘట్టం ఆవిష్కృతమైంది. ఉదయం 6.20 గంటల నుంచి సుమారు పది నిమిషాలు స్వామివారిపై కిరణాలు ప్రసరించాయి.పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.
*మత్స్యావతారంలో నారసింహుడు
6. యాదాద్రిలో మూడో రోజు బ్రహ్మోత్సవ వేడుకలు
లోక కల్యాణార్థమై ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మూడో రోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో విశేష వేడుకలు జరిపారు. నిత్యారాధనలతోసహా ఉత్సవపూజలు, అలంకార, వాహనోత్సవ క్రతువులతో భక్తిభావం వెల్లివిరిసింది. మహావిష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఆలయ దేవుడిని పెళ్లికొడుకుగా తీర్చిదిద్దే పర్వంలో తొలిగా మత్స్యాలంకరణ చేపట్టారు. అలంకార సేవను బాలాలయ మండపంలో భక్తజనుల మధ్య ఊరేగించారు. సేవా విశిష్టతను ప్రధాన పూజారి వివరించారు. రాత్రివేళ శేషవాహనోత్సవాన్ని నిర్వహించారు. శేషుడిపై శ్రీస్వామి,అమ్మవారలు భక్తులకు దర్శనమిచ్చారు. సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక పెరిగింది
7. చినజీయర్‌ స్వామిని కలిసిన స్వరూపానందేంద్ర స్వామి
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆదివారం ఉదయం చినజీయర్‌ స్వామిని కలిశారు. శంషాబాద్‌ పరిధి శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో వేదపండితుల మంత్ర పఠనాల మధ్య స్వరూపానందేంద్ర స్వామికి శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆయన తొలుత దివ్యసాకేతంలో కొలువుదీరిన కోదండ రంగనాథస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటీరంలో 20 నిమిషాలపాటు చినజీయర్‌ స్వామితో మాట్లాడిన స్వరూపానందేంద్ర స్వామి.. జూన్‌లో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శారదా పీఠాధిపతిని చినజీయర్‌ స్వామి సత్కరించారు.
8. చినజీయర్‌ను కలిసిన స్వరూపానందేంద్ర స్వామి
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆదివారం ఉదయం చినజీయర్‌ స్వామిని కలిశారు. శంషాబాద్‌ పరిధి శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో వేదపండితుల మంత్ర పఠనాల మధ్య స్వరూపానందేంద్ర స్వామికి శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆయన తొలుత దివ్యసాకేతంలో కొలువుదీరిన కోదండ రంగనాథస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటీరంలో 20 నిమిషాలపాటు చినజీయర్‌ స్వామితో మాట్లాడిన స్వరూపానందేంద్ర స్వామి.. జూన్‌లో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శారదా పీఠాధిపతిని చినజీయర్‌ స్వామి సత్కరించారు.
9. కొండగట్టులో పవిత్రోత్సవాలు ప్రారంభం
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో గతేడాది పూజల్లో జరిగిన లోపాలకు పరిహారంగా, చాత్తాద శ్రీ వైష్ణవ ఆచార సంప్రదాయాలను అనుసరించి లోక కల్యాణార్థం త్రయహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. రాత్రి విశ్వక్షేన ఆరాధన, పుణ్యహవచనం, అంకురారోహణ, అఖండ దీప స్థాపన తదితర ప్రత్యేక పూజాది కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపక వంశీయులు, అనువంశిక అర్చకులు నిర్వహించారు.సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు తిరుమంజనం, ఆరాధన, 9:30 గంటలకు పవిత్ర ఆహ్వానం, పుణ్యహ వచనం, రక్షా బంధనం, రుత్విక్ వరుణం, యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతార్చన, అగ్ని ప్రతిష్ట, హవనం, స్వామి వారికి అభిషేకం, అర్చన, మహా నివేదన, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 5:30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, స్థాపిత దేవతారాధన, హవనం, పవిత్రలకు జలాధివాసం, ధాన్యాధివాసం, బలిహరణం, వేద సదస్యం, మంత్ర పుష్పం, సాత్తుమోర, తీర్థ, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో, డిప్యూటీ కలెక్టర్ పరాంకుశం అమరేందర్ తెలిపారు. ఉత్సవాలు బుధవారం దాకా కొనసాగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
10.రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ..
వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, తలనీలాలను సమర్పించిన భక్తులు కోడెమొక్కులను తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.గండదీపం, కల్యాణ మొక్కులు, సత్యనారాయణ వ్రతాలు, పల్లకీసేవలు, పెద్దసేవలు తదితర మొక్కులను చెల్లించుకున్నారు. కల్యాణ మొక్కులను తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించుకునే పలు ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. లఘు దర్శనం మాత్రమే కల్పించారు. రాజన్నను దాదాపు 12వేల మందికిపైగా భక్తులు దర్శించుకోగా వివిధ ఆర్జితసేవల ద్వారా సుమారు రూ.8లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. రాజన్న ఆలయ అనుబంధ దేవాలయాల వద్ద కూడా భక్తుల రద్తీ నెలకొంది. సోమవారం దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.
11. తిరుమల- సమాచారం
ఈ రోజు సోమవారం
11.03.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 18C° – 33C°
నిన్న 84,982 మంది
శ్రీవారి భక్తులకి కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి
వారి దర్శన
భాగ్యం కలిగినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 05
గదులలో భక్తులు
వేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
12 గంటలు పట్టవచ్చును,
నిన్న 26,988 మంది భక్తులు
స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మ్రొక్కు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.24 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
తిరుపతి స్థానిక ఆలయ
సమాచారం(సా: 05 కి):
నిన్న 15,327 మంది
భక్తులకి తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన
భాగ్యం కల్గినది,
నిన్న 7,149 మంది
భక్తులకి శ్రీనివాసమంగాపురం
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర
స్వామి వారి దర్శన భాగ్యం
కల్గినది,
నిన్న 8,873 మంది
భక్తులకి తిరుపతి‌
శ్రీ గోవిందరాజ స్వామి
వారి దర్శన భాగ్యం కల్గినది,
నిన్న 8,873 మంది
భక్తులకు అప్పలాయగుంట
శ్రీ పసన్న వేంకటేశ్వర
స్వామివారి దర్శన
భాగ్యం కలిగినది,
12. చరిత్రలో ఈ రోజు/మార్చి 11
1915 : విజయ్ హజారే , భారత క్రికెటర్ జననం. (మ. 2004)
1689 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మరణం (జ.1657).
1955 : పెన్సిలిన్ ‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణించాడు (జ.1881).
1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
1999 : అమెరికా లో నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.
2013 : రోగాలను , రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి మరణం
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు.
కారులో తరలిస్తున్న 8కిలోల బంగారం, రూ.46లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
బంగారం, డబ్బులను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకురు.
బంగారం, నగదుకు లెక్కలు చూపించలేదని పోలీసులు వెల్లడించారు.
నిందితులను విచారణ నిమిత్తం విజయవాడకు తరలించా
13. శుభమస్తు
తేది : 11, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 7 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 43 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 57 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 9 ని॥ వరకు)
యోగము : ఐంద్రము
కరణం : భద్ర (విష్టి)
వర్జ్యం : (నిన్న రాత్రి 10 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 41 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 11 గం॥ 6 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 46 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 36 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 59 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 25 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోద : ఉదయం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 24 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : మేషము

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com