సైరా పాత్ర లీక్

‘మెగాస్టార్‌ చిరంజీవిగారి ‘సైరా’ చిత్రంలో వసంత పాత్ర పోషించాను. ఆ చిత్రంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు యువ కథానాయిక శాన్వీ మేఘన. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌’ ఈ నెల 15న విడుదల కానుంది. నాగసాయి మాకం దర్శకత్వంలో మహంకాళి శ్రీనివాస్‌ ఈ చిత్రం నిర్మించారు. ఈ సందర్భంగా శాన్వీ మాట్లాడుతూ ‘నేను తెలుగు అమ్మాయినే. హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. జయసుధగారు నిర్మించిన ఓ సీరియల్‌లో నటించాను. ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో నేను గోరటి వెంకన్నగారి కూతురిగా నటించాను. తెలంగాణ యాసలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో టీచర్‌గా నటించాను. ‘ఎదురీత’ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నాను. హీరోయిన్‌గా నేను నటించిన తొలి సినిమా ‘బిలాస్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాను’ అని చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com