శబరిమలైలో ఈసీ ఆంక్షలు

కేరళలో శబరిమల ఆలయ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీ కూడా ప్రచారానికి వాడరాదని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం హెచ్చరించింది. ఇలా చేయడం కచ్చితంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తీకా రామ్‌ మీనా స్పష్టం చేశారు. తిరువంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రచారంలో భాగంగా.. శబరిమల ఆలయం, దేవుడి పేరిట మత భావనలను రేకెత్తించడం; సుప్రీంకోర్టు తీర్పును ఏవిధంగానైనా ప్రస్తావించడం; మతం పేరుతో ఓట్లు అడగడం వంటివి చేయరాదని పేర్కొన్నారు. కేరళకు సంబంధించి శబరిమల వివాదాస్పద అంశమని, ఈ విషయమై రాజకీయ పార్టీలు కచ్చితమైన గిరి గీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
2. కృష్ణావతారంలో స్తంభోద్భవుడు
యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. అలంకార, వాహన సేవలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రరీత్యా ఉత్సవ పూజలతో పాటు అలంకార వేడుకలు నిర్వర్తించారు. వీటితో బాలాలయం అంగరంగ వైభవాన్ని సంతరించుకుంది. స్వామిని శ్రీకృష్ణుడి అలంకరణతో పెళ్లికొడుకుగా తీర్చిదిద్దారు. ఆలయ మండపంలో నేత్రపర్వంగా ఊరేగించారు. మేళతాళాలు మోగుతుంటే- పారాయణాల, ప్రబంధాల మధ్య సేవాపర్వాన్ని చేపట్టి ఆ విశిష్టతను అందరికీ వివరించారు. రాత్రివేళ స్వామి, అమ్మవార్లను హంస వాహనంపై ఉంచి విహారయాత్ర జరిపించారు.
3. శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖల నిలిపివేత
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. తిరుమలలో సోమవారం జేఈవో పాత్రికేయులతో మాట్లాడుతూ తితిదేతో ఎన్నికలకు ప్రత్యక్ష ప్రమేయంలేకున్నా.. ఓటర్లను ప్రలోభపెట్టేలా సిఫార్సు లేఖలు జారీ చేసే అవకాశం ఉన్నందున గతంలో మాదిరిగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనానికి నెలకోసారి కంటే ఎక్కువసార్లు వచ్చే వారిపైనా నియంత్రణ విధించనున్నట్లు చెప్పారు.
4. కొల్లేటి దేవతకు చామంతుల అర్చన
కైకలూరు మండలంలోని కొల్లేటికోటలో కొలువైయున్న శ్రీపెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి ఉదయం 5 గంటల నుంచే చతుర్థావరణ పూజ, కలశార్చన, పుష్పాలంకరణ, ధూపసేవ, బాలభోగం, హారతి వంటి పూజలు ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో చేశారు. సోమవారం ప్రత్యేకంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, లక్ష చామంతుల అర్చన, లక్షకుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకున్నారు. ఆకివీడుకు చెందిన కొటికలపూడి వెంకట సూర్యనారాయణ దంపతులు అమ్మవారికి వస్త్రాలంకరణ, కైకలూరుకు చెందిన ఫణివర్మ దంపతులు అమ్మవారికి పుష్పాలంకరణ, భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. దాతలను ఆలయ అర్చకులు, ఈవో ఆకుల కొండలరావులు అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు మంచినీరు, పిల్లలకు ఉచితంగా పాలు అందజేశారు. రాత్రికి అరుణకుమారి భాగవతారిణి ఆధ్వర్యంలో హరికథా కాలక్షేపం విశేషంగా అలరించింది. దాతలను, ప్రముఖులను ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ జల్లురి వెంకన్న, సభ్యులు పన్నాస లక్ష్మీకుమారి, సైదు ఏడుకొండలు, హనుమంతు, రాజమోహన్‌లు సన్మానించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
5. శ్రీరామనవమికి సీఎం రాక అనుమానమే-ప్రొటోకాల్‌ సందడి తగ్గితే సామాన్య భక్తులకు మంచిదే..
పార్లమెంట్‌ ఎన్నికల నగారా మోగడంతో ఈ ప్రభావం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే కోణంలో సమాలోచనలు సాగుతున్నాయి. ఏప్రిల్‌ 6న ఉగాది నుంచి బ్రహ్మోత్సవాలు ఆరంభించి 10న ఉత్సవ అంకురార్పణ చేస్తారు. 11న గరుడ పట అధివాసం ఉంటుంది. 12న అగ్ని ప్రతిష్ఠ, 13న ఎదుర్కోలు, 14న శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామికి కల్యాణం ఉంటుంది. 15న పట్టాభిషేకం, 16న సదస్యం నిర్వహిస్తారు. 20తో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీరామనవమికి తానీషా ప్రభువు కాలం నుంచి ముత్యాల తలంబ్రాలను తీసుకురావడం ఆనవాయితీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండగా కొన్ని ప్రత్యేక కారణాలతో మాత్రమే ముఖ్యమంత్రులు ఇక్కడి రాలేకపోయారు. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలు ఖరారు కావడంతో మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఆదివారం ఈ షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముత్యాల తలంబ్రాలను తీసుకువచ్చే సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి కొనసాగిస్తారా? లేదా? అన్నదానిపై స్థానికంగా చర్చ సాగుతోంది. గతంలో ఇలాంటి కోడ్‌ అమల్లో ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి చెరో దఫా ఇక్కడకు రాలేకపోయినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో దేవాదాయశాఖ అధికారులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. తెలంగాణాలో ఏప్రిల్‌ 11న ఎన్నికలు ఉండటంతో ముఖ్యమంత్రి కల్యాణోత్సవానికి రాకపోవచ్చని అనుకుంటున్నారు. వేర్వేరు కారణాలతో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీరామనవమికి రాలేదు. వచ్చే నెల 14న రాలేకపోతే వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి లేకుండానే ఉత్సవాలను నిర్వహించినట్టవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే స్పష్టత వస్తుంది.
6. తిరుమల – సమాచారం
ఈ రోజు మంగళవారం
12.03.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
నిన్న 71,210 మంది
శ్రీవారి భక్తులకి కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి
వారి దర్శన
భాగ్యం కలిగినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 01
గదులలో భక్తులు
వేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు పట్టవచ్చును,
నిన్న 21,947 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మ్రొక్కు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 4.10 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
7. నేడు వృద్ధులు, దివ్యాంగులకు, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
మార్చి 13వ తేదీన‌ చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులోభాగంగా మార్చి 12వ తేదీ మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా,
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది. ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను మార్చి 13వ తేదీ బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
8. శుభమస్తు
తేది : 12, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 44 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 49 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 10 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 53 ని॥ వరకు)
యోగము : వైదృతి
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 9 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 11 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 46 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 37 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 11 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 2 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 54 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 25 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : మేషము
9 చరిత్రలో ఈ రోజు/మార్చి 12*
1930: భారత స్వాతంత్ర్య ఉద్యమములో ప్రముఖ ఘట్టమైన దండి యాత్ర (200 మైళ్ళ దూరం) ప్రారంభమైంది.
1993: ముంబైలో బాంబు పేలుళ్ళు
1912: జూలియట్ గార్డన్ లో గర్ల్ (బాలికల) స్కౌట్స్ ప్రారంభించారు.
1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా దామోదరం సంజీవయ్య పదవీ విరమణ (11 జనవరి 1960 నుంచి 12 మార్చి 1962 వరకు).
1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం (12 మార్చి 1962 నుంచి 29 ఫిబ్రవరి 1964 వరకు).
2011: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం
1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి జననం

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com