Politics

సంగం డైరీ యాజమాన్య బదిలీ జీవో విడుదల-తాజావార్తలు

News Roundup - Sangam Dairy To Merge Into Guntur Milk Union

* సంగం డైరీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవో విడుదల.సంగం డైరీ యాజమాన్య హక్కులు మారుస్తూ జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.సంగం డైరీ గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి బడలయిస్తు ఇస్తూ జీవో జారీ.రోజువారీ కార్యకలాపాలు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే జీవో విడుదల చేశామంటున్న ప్రభుత్వం.తెనాలి సబ్ కలెక్టర్ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు. ధూళిపాల నరేంద్ర దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ.

* మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్యంపై టీడీపీ అధినేత, చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ.అమెరికాలోని ప్రముఖ వైద్యులతో సంప్రదింపులు.ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచన.ఎయిర్ అంబులెన్స్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు.సబ్బం హరిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు.

* తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేదని.. అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ పంపుతున్నట్లు చెప్పారు. ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణకు ఐఏఎస్‌ అధికారులను నియమించినట్లు ఈటల వెల్లడించారు. రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటుందని.. ఈ నేపథ్యంలో నిత్యం 400 టన్నులు రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.

* భారత్‌లో కరోనా సృష్టిస్తున్న విలయంపై మరో టెక్‌ దిగ్గజం యాపిల్‌ స్పందించింది. కష్టకాలంలో ఉన్న భారతీయులకు సాయమందించేందుకు ముందుకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో మహమ్మారి నివారణకు జరుగుతున్న కార్యక్రమాలకు విరాళాల రూపంలో తమ వంతు సహకారం అందిస్తామని సంస్థ సీఈఓ టిమ్‌ కుక్‌ ప్రకటించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరస్‌బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,435 పరీక్షలు నిర్వహించగా.. 11,434 కేసులు నిర్ధారణ కాగా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,54,875 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,61,43,083 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

* తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక సరిగా లేదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కరోనా కేసులు, మరణాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది. పదేపదే ఆదేశిస్తున్నా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. రోజూ జిల్లాల వారీగా బులెటిన్‌ ఇవ్వాలని.. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం హితం యాప్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మినీ పురపోరు ఎన్నికలతో కరోనా ఉద్ధృతి పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు మినీ పురపోరుకు సంబంధించి పోలింగ్‌ బూత్‌ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల వేళ కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 29లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఎస్‌ఈసీని ఆదేశించింది.

* కొవిడ్‌ మహమ్మారితో యావత్‌ దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రేక్షకుడిగా ఉండలేమని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కరోనా విలయంతో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అక్కడి హైకోర్టులు మెరుగైన స్థితిలో పర్యవేక్షిస్తున్నప్పటికీ సంక్షోభ సమయంలో తాము స్పందించకుండా ఉండలేమని తెలిపింది. రాష్ట్రాల మధ్య జరుగుతున్న సహకారాలను సమన్వయ పరచడంలో తమ పాత్ర ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. కరోనా మహమ్మారి వల్ల దేశం ఎదుర్కొంటున్న సమస్యలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, నేడు మరోసారి విచారణ చేపట్టింది.

* దేశంలో కరోనా ఉద్ధృతి ప్రజలను ఆందోళనలోకి నెట్టేస్తోంది. సోమవారం 16,58,700 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,23,144 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజాగా 2,771 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. అయితే క్రితం రోజు(3.52లక్షల కేసులు…2,812 మరణాలు)తో పోల్చుకుంటే కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కి చేరింది. మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువవుతోంది.

* ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణకుమార్‌రాజు అభిప్రాయపడ్డారు. విశాఖ భాజపా కార్యాలయంలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఓ తుగ్లక్‌ చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఔషధాలపై 3 నెలలు జీఎస్టీ లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీలో భవనాలు కూల్చివేత, చిన్న చిన్న షాపుల తొలగింపుపై అధికార యంత్రాంగానికి ఉన్న శ్రద్ధ.. కరోనా వ్యాప్తి నియంత్రణపై లేదని విమర్శించారు. కొవిడ్‌ సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం? అని ఆయన ప్రశ్నించారు. ఇంకా మూడేళ్లపాటు జగన్‌ సీఎంగా ఉంటారని తాను అనుకోవడం లేదని విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యలు చేశారు.