గ్యాంగ్‌స్టర్ నయీం స్థానంలోకి ఫయీం–నేరవార్తలు–03/12

*నయీం బ్రతికే ఉన్నాడు అంటున్న భార్య హసీనా బేగం. ఇలా చెప్పి అందరిని భయపెట్టి దందా చేయడానికి మాస్టర్ ప్లాన్ చేసింది నయీం భార్య హసీనా బేగం. నయీం లా ఉండే ఫయీం ను గెటప్ మార్చి అచ్చం నయీం లా తయారు చేసింది హసీనా బేగం. నయీం సామ్రాజ్యానికి బిగ్ బాస్ గా వ్యవహరించేందుకు ఫయీం ను తీసుకొచ్చింది. నయీం లాగే టైట్ టి షర్ట్, మెడలో గొలుసులు, కుడి చేతికి వాచ్, ఎడమ చేతికి బంగారు బ్రాస్ లెట్, చేతికి ఉంగరాలను ఫయీం కు వేసి ఇతడే నయీం అని నమ్మించే ప్రయత్నం చేసింది నయీం భార్య హసీనా బేగం. ఫయీం ను చూపించి నయీం బ్రతికే ఉన్నాడంటూ దందాలకు తెరలేపడనికి స్కెచ్ వేసింది నయీం భార్య
క్యాప్ ఉల్టా పెట్టి కార్ గ్లాస్ కొద్దిగా ఓపెన్ చేస్తే నయీం వచ్చినట్టు సంకేతం. ఇదే తరహాలో నయీం వచ్చినట్టు ఫయీం తో చేపించి మళ్ళీ దందా షురూ చేయడానికి భార్య హసీనా బేగం మాస్టర్ ప్లాన్ చేసింది. హసీనా బేగం.. నయీం అనుచరులతో కలిసి నయీం ఉన్నప్పుడు ఎలా దందా చేసాడో అలాగే ఫయీం ను అడ్డం పెట్టుకొని దందా చేయడానికి చేసింది. ఆ ప్లాన్ ను రాచకొండ పోలీసులు కనిపెట్టి అడ్డుకట్టవేసి అందరిని అరెస్ట్ చేశారు.
* పల్నాడులో మరోసారి మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని లేఖలో హెచ్చరించారు మావోయిస్టులు.
* మంగళగిరి లో రూ.82 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
* నెల్లూరు జిల్లా జలదంకి బ్రాహ్మణక్రాక లోని శ్రీ విద్యా నికేతన్ స్కూల్లో 10 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు ఆత్మ హత్యయత్నం వైద్యశాలకు తరలింపుశ్రీ లత అనే విద్యార్థిని మృతి. మరొక విద్యార్థిని పరిస్థితి విషమం, నెల్లూరు కు తరలింపుపాఠశాల ఉపాధ్యాయులు మందలించారని క్షణికావేశంలో ఆత్మ హత్యాయత్నం.
* చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అరెస్ట్‌..
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని వికారాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల జలాల సాధన కోసం ఆయన దీక్ష చేపట్టారు. అలాగే వికారాబాద్‌కు MMTS సాధన, సాటిలైట్‌ సిటీ, ఇతర హామీల కోసం ఆయన పోరాటానికి దిగారు. ఎన్నికల కోడ్‌‌ ఉందంటూ పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి దీక్షలకు అనుమతి లేదని పోలీసులు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి చెప్పారు. అయినా దీక్షను విరమించేందుకు ఆయన నిరాకరించడంతో అరెస్ట్‌ చేశారు. కొండాతో పాటు దీక్షలో కూర్చున్న మాజీ మంత్రులు ఏ చంద్రశేఖర్‌ రెడ్డి, జీ ప్రసాద్‌ కుమార్‌, పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్‌ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిలను అరెస్ట్‌ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
* ఈ-బిజ్‌ సంస్థ పేరిట మరో భారీ మోసం బయటపడింది. వెయ్యి కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడిన నేరస్థుడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నేరస్థుడి ఖాతాల్లోని సుమారు రూ.70లక్షలు స్తంభింపజేసినట్టు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు.
* గుంటూరు జిల్లాతాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పేకాట స్థావరాలపై దాడి చేసిన పోలీసులు….పట్టుపడ్డ 9 మంది జూదరులు7 వేల 400 రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు…సీఎం నివాసానికి కూత వేటు దూరంలో యథేచ్ఛగా పేకాట స్థావరాలు.. పట్టించుకోని ఉన్నత అధికారులు..కొంతమంది అధికార పార్టీ నాయకుల అండతోనే పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన స్థానికులు.
*కేరళలోని తిరువల్లలో పట్టపగలే దారుణం వెలుగుచూసింది. 18ఏళ్ల బాలికపై ఆమె స్నేహితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాధితురాలికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాలికకు నిప్పంటించి పారిపోయేందుకు ప్రయత్నించిన అజిన్ రెజీ అనే యువకుడిని స్థానిడొకరు పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.
*ఆస్తిలో వాటా ఇస్తేనే దహన సంస్కారాలు నిర్వహించాలంటూ మృతదేహాన్ని రెండు రోజులుగా ఇంట్లోనే ఉంచి ఇంటికి కుటుంబ సభ్యులు తాళం వేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి .. పాల్వంచ పట్టణంలోని పేట చెరువు ప్రాంతంలో నివసిస్తున్న టీ. సమ్మయ్య భార్య మృతి చెందడంతో రత్తమ్మ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు
*ఫిషింగ్ బోటు, ఆయిల్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. హాంకాంగ్‌లోని లమ్మా ఐలాండ్‌లో ఈ ఘటన జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ధాటికి చేపల వేటకు వెళ్లిన నౌక ముంపునకు గురైంది. అయితే ఆయిల్ ట్యాంకర్‌పై ఉన్న 13 మంది సురక్షితంగా ఉన్నారు. ఫిషింగ్ బోటులో ఉన్నవారు ఎవరైనా గల్లంతయ్యారా అనేది ఇంకా తెలియాల్సి ఉందని, రెస్యూ టీం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తుందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గత జనవరిలో హాంకాంగ్‌లోనే ఆయిల్‌ట్యాంకర్‌లో మంటలు చెలరేగిన ఘటనలో…ఓ వ్యక్తి మృతి చెందగా..ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాత నగర్‌ మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి రెండు కాళ్ళు విరిగాయి. మృతులను సింగభూపాలెం గ్రామానికి చెందిన ఇల్లంగి లాజర్‌(25), కోడిరెక్కల రాజు(20)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
*భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలంలోని సెంట్రల్‌ పార్క్‌ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు – బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
*పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా గత నెల 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌ ఉగ్ర శిక్షణ శిబిరంపై భారత్‌ జరిపిన వైమానిక దాడుల్లో 263 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ‘టైమ్స్‌ నౌ’ ఛానల్‌ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు తమకు నిఘా వర్గాల సమాచారం అందినట్లు తెలిపింది. వైమానిక దాడులు చోటుచేసుకోవడానికి 5 రోజుల ముందు శిబిరంలో మొత్తం 263 మంది ఉగ్రవాదులు ఉన్నారని తెలియజేసింది. అందులో 18 మందిని జైష్‌-ఎ-మహ్మద్‌(జేఈఎం) సీనియర్‌ కమాండర్లుగా పేర్కొంది. మిగిలిన ఉగ్రవాదుల్లో 83 మంది ప్రాథమిక దౌరా-ఎ-ఆమ్‌ శిక్షణ కోసం, 91 మంది కఠినమైన దౌరా-ఎ-ఖాస్‌ శిక్షణార్థం, 30 మంది దౌరా-ఎ-మౌతులా శిక్షణ కోసం అక్కడికి చేరుకున్నారని తెలిపింది. 25 మంది ఆత్మాహుతి దాడులు జరిపేందుకు శిక్షణ పొందుతున్నారని సూచించింది. మిగిలినవారిని వంట మనుషులు, క్షురకుల వంటి సిబ్బందిగా పేర్కొంది. వారంతా వైమానిక దాడుల్లో హతమయ్యారని పేర్కొంది.
మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ రోజు జరుగుతున్న పరీక్ష రాసేందుకువెళుతుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.*జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి చెందగా
*పెదనాన్న కుమారుని పెళ్లి కోసం సెలవుపై వచ్చిన ఓ సైనికుడు మరో యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
*కారులో తరలిస్తున్న రూ.91లక్షల నగదును విజయవాడలోని సత్యనారాయణపురం స్టేషన్‌ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తొలి రోజే భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం బెజవాడలో కలకలం రేపింది.
*ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేరులంక-పోలంపల్లి గ్రామాల మధ్య సోమవారం మావోయిస్టులు అమర్చిన పదార్ధాలు పేలి ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పనుల కోసం పలువురు ట్రాక్టర్‌లో వెళ్తుండగా, దారిలోని చిన్నపాటి వంతెన వద్ద బాంబులు ఒక్కసారిగా పేలాయి. స్థానికులు అందించిన సమాచారంతో, గాయపడిన ఇద్దరినీ పోలీసులు వెంటనే దోర్నపాల్‌ ఆసుపత్రికి తరలించారు.
*ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలలో మావోయిస్టులు చెలరేగిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఓపోలీసు అధికారిని, ఓ ఉపాధ్యాయుడిని హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు సోమవారం ఏఎస్సైని హత్య చేసి ఓ ఉపాధ్యాయుడిని అపహరించుకుపోయారు.
* వివాహేతర సంబంధం నేపథ్యంలో గర్భం దాల్చిన ఓ మహిళ (25) ఎవరి సహకారం లేకుండా ఒంటరిగా మొబైల్‌ఫోన్‌లో ప్రసవ ప్రక్రియ వీడియోను చూస్తూ బిడ్డను కనడానికి చేసిన ప్రయత్నంలో మృతి చెందింది.
* ఓటర్ల డేటా చౌర్యం చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసే అధికారం తెలంగాణ పోలీసులకు లేదని ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా హైకోర్టులో పేర్కొన్నారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరపకుండా కేసులు నమోదు చేయడం తగదని వాదించారు. సిట్‌ దర్యాప్తుపై తమకు అభ్యంతరం ఉందన్నారు.
*ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా అపరిచితులను నమ్మి వారి కామకోరలకు చిక్కుకున్న విద్యార్థినుల ఉదంతాలు తమిళనాట నమోదవుతున్నాయి. నిందితుల వలలో చిక్కి దీనంగా అభ్యర్థించే విద్యార్థినులకు సంబంధించిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఒక కేసులో నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న చరవాణుల్లో సుమారు వందకుపైగా వీడియోలు ఉన్నాయని, బాధితులు 200 మంది వరకు ఉండవచ్చనే వార్తలు వచ్చాయి.
* భర్తను వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల మహిళ… ప్రియుడితో కలిసి కన్నవారిని కడతేర్చింది! చాయ్‌ తాగమంటూ నిద్రమాత్రలు కలిపిన తేనీటిని ప్రేమగా అందించి… వారు మత్తులోకి జారుకున్నాక దిండుతో ఊపిరాడకుండా చేసింది. కాలువలో దొరికిన రెండు మృతదేహాల సూట్‌ కేసుల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు.
*జమ్ము-కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టారులో భారత సైనికులు జరిపిన కాల్పుల్లో గత వారం రోజుల్లో ఆరుగురు పాకిస్థాన్‌ జవాన్లు హతమయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండడంతో సైనికులు గట్టిగా సమాధానం ఇచ్చారని ఓ సైనికాధికారి తెలిపారు.
*పెళ్లయిన 13 ఏళ్లకు తొలిసారిగా భార్యను కారులో విహారానికి తీసుకెళ్తే… ప్రమాదం చోటుచేసుకుంది! ఒక్కసారిగా వాహనంలో మంటలు రాజుకున్నాయి. ఆ ఘటనలో భార్య, ఇద్దరు కుమార్తెలు దుర్మరణం పాలయ్యారు. మరో చిన్నారి, భర్త మాత్రం బయటపడ్డారు. అయితే ఇది ముమ్మాటికీ హత్యేనని, పథకం ప్రకారమే తమ కుమార్తె, బిడ్డలను అల్లుడు మట్టుబెట్టాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
*పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి సూత్రధారి ముదాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ ‘మహ్మద్‌ భాయ్‌’ని భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టాయి.
*కర్ణాటకలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట బెదిరింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో సోమవారం మధ్యాహ్నం ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉరేసుకుంది.
*వివాహమై నెల రోజులు కూడా గడవక మునుపే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు నవ దంపతులను పొట్టనబెట్టుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం కుమ్మరిగూడెం బస్టాప్‌ వద్ద సోమవారం జరిగిన ఘటన ఇది.
*పెళ్లి అయిన నెలరోజుల్లోనే ఒక జంట ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి నగరంలోని అలిపిరి-జూపార్కు రోడ్డులోని సైన్స్‌ సెంటర్‌ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో వారు మృతిచెందారు.
*సరదాగా మొదలైన పబ్జీ ఆట ప్రాణాల మీదికి తెచ్చింది. తల్లి మందలించిందన్న మనస్తాపంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో ఆదివారం రాత్రి ఘటన ఇది. మేడ్చల్‌ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన వెంకట నారాయణ కుటుంబం గజ్వేల్‌ పట్టణం ప్రజ్ఞాపూర్‌లో స్థిరపడింది.
*డేటా చౌర్యం కేసులో ఐటీ గ్రిడ్స్‌ అధినేత డాకవరపు అశోక్‌కు తెలంగాణ సిట్‌ అధికారులు సోమవారం మరోమారు నోటీసులు జారీ చేశారు. గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. స్పందన లేదు. తాజాగా సిట్‌ అధికారులు సోమవారం కేపీహెచ్‌బీలోని అశోక్‌ ఇంటికి వెళ్లారు. తాళం వేసి ఉంది. నోటీసును తలుపునకు అంటించారు.
*పెళ్లి మంటపంలోకి పెళ్లికొడుకు మద్యం తాగి వచ్చాడని పెళ్లికి నిరాకరించింది ఓ యువతి. బిహార్‌లోని ఛాప్రా పట్టణానికి దగ్గరలోని దుమ్రి చాపియా గ్రామానికి చెందిన రింకి కుమారికి బబ్లు కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. శనివారం పెళ్లి మంటపంలోకి వరుడు పూటుగా మద్యం తాగి వచ్చాడు. పెళ్లి తతంగంలో వరుడు తాళి కట్టే పరిస్థితిలో కూడా లేడని గ్రహించిన రింకీ అతణ్ని పెళ్లి చేసుకోనని తన తల్లిదండ్రులకు తేల్చి చెప్పింది. ఇరు కుటుంబాల పెద్దలు, పెళ్లికొచ్చిన వారు ఎంత నచ్చ చెప్పినా ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు.
*వనస్థలిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో కత్తితో కిరాతకంగా దాడిచేసి ఆపై ఓ భర్త తనను తానే పొడుచుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బీడీఎల్‌ కాలనీలో చోటుచేసుకుంది.
*ఐటీ గ్రిడ్స్‌ అధినేత డాకవరపు అశోక్‌కు తెలంగాణ సిట్‌ అధికారులు సోమవారం మరోమారు నోటీసులు జారీ చేశారు. గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. స్పందన లేదు. తాజాగా సిట్‌ అధికారులు సోమవారం కేపీహెచ్‌బీలోని అశోక్‌ ఇంటికి వెళ్లారు. తాళం వేసి ఉంది. నోటీసును తలుపునకు అంటించారు. ‘ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ గోషామహల్‌లోని సిట్‌ కార్యాలయానికి రావాలని అశోక్‌ ఇంటికిఅంటించిన నోటీసులో పేర్కొన్నాం’ అని సిట్‌ అధికారులు వివరించారు.
*హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌ పరిధిలో మరో హవాలా రాకెట్‌ గుట్టురట్టయింది. ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించి..నలుగురు వ్యాపారుల నుంచి రూ.90.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా కాచీగూడ, సుల్తానాబాద్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు పోలీసులు చేపట్టారు. వేర్వేరుగా వాహనాల్లో నగదు తరలిస్తున్న వ్యాపారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దేవేష్‌ కొటారి అనే వ్యక్తి వద్ద రూ.50 లక్షలు స్వాధీనం చేసుకోగా.. భక్తిప్రజాపతి వద్ద రూ.23 లక్షలు, నసీమ్‌ వద్ద రూ.5.70 లక్షలు, విశాల్‌ జైన్‌ వద్ద రూ.11.80 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. వీటికి నిందితులు ఎలాంటి ఆధారాలు చూపించలేదని చెప్పారు. వీరు గత కొంత కాలంగా వేర్వేరుగా హవాలా వ్యాపారం నిర్వహిస్తూ డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. వీరి వద్ద నుంచి మూడు క్యాష్‌ కౌంటింగ్‌ యంత్రాలతోపాటు నాలుగు ద్విచక్రవాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50వేల రూపాయలకు మించి ఎక్కువ వెంట ఉంచుకోవద్దని… అంతకంటే ఎక్కువ డబ్బు ఉంటే దానికి తగిన ఆధారాలు చూపాలని చెప్పారు.
*టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌, అబుధాబి యువరాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌లతో ప్రధాని మోదీ సోమవారం వేర్వేరుగా ఫోన్లలో సంభాషించారు. ఇటీవల భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రస్తావన వీరిమాటల్లో వచ్చిందీ లేనిది వెల్లడి కాలేదు. పాకిస్థాన్‌ పదేపదే పలు దేశాలను మధ్యవర్తిత్వం వహించాలని కోరుతున్నా ఏ దేశమూ అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేని సంగతి తెలిసిందే. ప్రపంచశాంతి, భద్రతకు ఉగ్రవాదం పెద్ద ముప్పుగా పరిణమించిందని ఎర్డోగాన్‌తో మోదీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ పేరును ప్రస్తావించకుండా ఉగ్రవాదంపై తక్షణ, తిరుగులేని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
*వివాహేతర సంబంధం నేపథ్యంలో గర్భం దాల్చిన ఓ మహిళ (25) ఎవరి సహకారం లేకుండా ఒంటరిగా మొబైల్‌ఫోన్‌లో ప్రసవ ప్రక్రియ వీడియోను చూస్తూ బిడ్డను కనడానికి చేసిన ప్రయత్నంలో మృతి చెందింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com