రూ.15 వేల కోట్లు కట్టాలి-వాణిజ్య-03/13

*టాటా టెలీసర్వీసెస్‌ (టీటీఎస్‌ఎస్‌)ను విలీనం చేసుకునేందుకు ఎయిర్‌ టెల్‌ భారీ మొత్తం చెల్లించాల్సి రావొచ్చు. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజ్‌ చార్జి (ఎస్‌యూసీ), వన్‌ టైం స్పెక్ట్రం చార్జ్‌‌ (ఓటీఎస్‌సీ) కింద రూ.15 వేల కోట్లు కడితేనే విలీనానికి అంగీకరిస్తామని డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్ టెలికాం (డాట్‌) షరతు విధించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎస్‌యూసీగా ఎయిర్‌ టెల్‌ రూ.10 వేల కోట్లు, టీటీఎస్ఎల్‌ రూ.2,800 కోట్లు బకాయిపడ్డారని డాట్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఓటీఎస్‌సీకి గానూ ఎయిర్‌ టెల్‌ నుంచి మరో రూ.రెండు వేల కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. విలీనమవుతున్న రెండు కంపెనీల లైసెన్సు ఫీజులను డాట్‌ అధికారులు ప్రస్తుతం లెక్కిస్తున్నారు. ఇది కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుందని మరో సీనియర్‌ అధికారి తెలిపారు. లైసెన్సు ఫీజు, ఎస్‌యూసీ, ఓటీఎస్‌సీ చెల్లించడానికి ఎయిర్‌ టెల్‌ గతంలోనే అంగీకరించింది. ఎన్సీఎల్టీ అంగీకరించినా.. నష్టాల్లో ఉన్న టీటీఎస్‌ఎల్‌ ఎయిర్‌ టెల్‌ లో విలీనం కావడానికి ఎన్సీఎల్టీ గత నెల అంగీకరించింది. ఇందుకు డాట్‌ అనుమతి తప్పనిసరి.
*గ్రామీణ భారతంలో క్షయ (టీబీ) వ్యాధిని కచ్చితంగా నిర్థారించేందుకు వీలుగా కృత్రిమ మేధ ఇమేజింగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేయడం, దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు అపోలో హాస్పిటల్స్‌ గ్రూపునకు చెందిన హెల్త్‌ నెట్‌ గ్లోబల్‌ (హెచ్‌ఎన్‌జీ), ఇజ్రాయెల్‌కు చెందిన జెబ్రా మెడికల్‌ విజన్‌తో జట్టు కట్టింది.
*వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,100, విశాఖపట్నంలో రూ.33,180, ప్రొద్దుటూరులో రూ.33,100, చెన్నైలో రూ.32,080గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,870, విశాఖపట్నంలో రూ.30,520, ప్రొద్దుటూరులో రూ.30,600, చెన్నైలో రూ.30,600గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,200, విశాఖపట్నంలో రూ.39,600, ప్రొద్దుటూరులో రూ.39,600, చెన్నైలో రూ.41,500 వద్ద ముగిసింది.
*రూ.2,338 కోట్ల విలువైన 6 నిరర్థక ఆస్తు (ఎన్‌పీఏ)లను ఈనెల 26న వేలం వేయనున్నట్లు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. అన్ని ఖాతాలను 100 శాతం నగదు చెల్లింపు ప్రాతిపదికపైనే వేలం వేస్తారు. ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా వేలంలో పాల్గొనవచ్చు.
*ఈ ఏడాది భారత్‌, నేపాల్‌ విపణుల్లో విస్తరించడానికి ఆతిథ్య సేవల సంస్థ ఓయో సన్నాహాలు చేస్తోంది. మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్గత సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి రూ.1400 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.
*సీపీఎస్‌ఈ (కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు) ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌) మలి విడత ఇష్యూకు (ఎఫ్‌ఎఫ్‌ఓ-ఫాలో ఆన్‌ ఫండ్‌ ఆఫర్‌) ప్రభుత్వం మరోమారు సిద్ధమైంది.
*ఇప్పుడు ఎక్కడ చూసినా కృత్రిమ మేధ.. వ్యాపార సంస్థల్లో దాన్ని ఎక్కడ, ఎలా వాడాలి? ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి? దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? వ్యాపార సంస్థలో ఉన్న అధికారులకు ఇలాంటివి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి.
* పరిశ్రమల నిరాశజనకమైన వృద్ధి కొనసాగింది. తయారీ రంగం నెమ్మదించడంతో జనవరిలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) సూచీ వృద్ధి 1.7 శాతంగా నమోదైంది. ముఖ్యంగా యంత్ర పరికరాలు, మన్నికైన వినిమయ వస్తువుల రంగాలు నిరాశపరిచాయి.
*పెప్సీ కో సంస్థకు చెందిన చిరుతిళ్ల బ్రాండ్‌ కుర్‌కురే మసాల మంచ్‌ పేరుతో కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని నువ్వుల నూనెతో తయారు చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్పత్తికి ప్రచారకర్తగా సినీ నటి అక్కినేని సమంత వ్యవహరించనున్నట్లు పేర్కొంది.
*విద్యార్థి దశలోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించే లక్ష్యంతో టై హైదరాబాద్‌ ‘టై గ్రాడ్‌ బిజినెస్‌ ఐడియా టోర్నమెంట్‌’ను ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, వైద్య కళాశాలలలోని విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగం చేయనుంది.
*ఏ సంస్థ అయినా సజావుగా నడవాలన్నా, అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలన్నా, సంబంధిత రంగ నియంత్రణ సంస్థ ఆదేశాలకు అనుగుణంగా సాగాల్సిందే. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వంటి శక్తిమంత నియంత్రణ సంస్థతో పలు అంశాల్లో ఢీ అంటే ఢీ అంటూనే, తన సంస్థను లాభాల్లో (రికార్డుల ప్రకారమే అయినా) నడిపించగలుగుతున్నారు ఉదయ్‌ కోటక్‌. దీంతోపాటు ఆయన సంపద విలువ కూడా గత అయిదేళ్లలో గణనీయంగా పెరిగి దాదాపు రూ.80,000 కోట్ల (11.4 బిలియన్‌ డాలర్ల)కు చేరడం గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com