రూ. కోటి విలువైన డ్రగ్స్ పట్టివేత–నేరవార్తలు–03/13

*హైదరాబాద్ లో భారీగా మడక ద్రవ్యాలను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా నేరెడ్ మెట్ దగ్గర వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అక్రమంగా మడక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఈ ముటా పట్టుబడింది. ముటాలో ఐదుగురిని పట్టుకొగా మరొకరు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి భారీగా కొకైన్, హైరాయిన్, కెమికల్ పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఏపీ, తెలంగాణలలో గత కొంతకాలంగా ఈ ముటా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి కొకైన్, హైరయిన్ ను వీరు సరఫరా చేస్తున్నారు.
* జయరాం హత్య కేసులో సినీనటుడు అరెస్ట్
ఎక్స్ ప్రెస్ టీవీ ఎండీ, ఎన్నారై జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీనటుడు సూర్య, కిశోర్‌, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. జయరాం మృతదేహాన్ని చూసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విచారణ చేపట్టారు.
* సీఎం నివాసం ఎదుట సత్యనారాయణ అనే కార్యకర్త ఆత్మహత్యాయత్నం..ఒంటిపై పెట్రోల్ పోసుకున్న సత్యనారాయణ
సిట్టింగ్ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కి టికెట్ ఇవ్వొద్దు అంటూ నినాదాలు.
* ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంాజేడు మండల కేంద్రంలోని జగన్నాధపురం వై జoక్షన్ వద్ద చత్తిస్గఢ్ రాష్ట్రనికి బ్రతుకు దేరువు కోసం వలస కూలీలతో వెళ్తున్న బోలోరో వాహనం బోల్తా.అందులో ప్రయాణిస్తున్న 20 మంది కూలీలకు తీవ్ర గాయాలు.నలుగురి పరిస్థితి విషమం.ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలింపు.
* ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల్ని సోమవారం సభాపతి క్యాంపు కార్యాలయంలో సభాపతి కోడెల శివప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు శివరాం పంపిణీ చేసి నిబంధనలు ఉల్లంఘించారని వైకాపా, సీపీఐ, జనసేన నాయకులు ఆతుకూరి నాగేశ్వరరావు, నరిశెట్టి వేణుగోపాల్‌, కొమ్మిశెట్టి అర్జునరావు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి డీఎస్పీ వి.కాలేషావలీ పదవీ విరమణ వచ్చే జులైలో జరగనుందని, ఆయనకు ఎన్నికల విధులు కేటాయించకూడదనే నిబంధనల్ని పక్కనపెట్టారని వైకాపా నాయకుడు ఆతుకూరి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
*జైష్ ఎ మహమద్ అధినేత మసూద్ అజాల్ ను అజార్ జీ అని సంబోదించిన రాహుల్ గాంధీపై బీహార్ లోని చీఫ్ జూడిసీయాల్ మేజిస్ట్రేట్ కార్యకర్త తమన్నా హస్మి ఫిర్యాదు మేరకు రాజద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
* ఆగస్టా వెస్ట్లాండ్ చాపర్ స్కాంలో మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మిషెల్ మరో బాంబు పేల్చాడు. ‘సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా కొద్ది రోజుల క్రితం నన్ను దుబాయ్లో కలిశాడు. ఈ కేసు తన కాళ్లకు చుట్టుకోకుండా చూడాలని కోరాడు. లేకుంటే నా జీవితం నాశనం చేస్తానన్నాడు. జైల్లోనే చావాల్సి వస్తుందని బెదిరించాడు’ అని మంగళవారం కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. జైలులో కాశ్మీరీ వేర్పాటువాదులతోపాటు కరడుగట్టిన నేరస్తులున్న గదిలో తననుంచారని తెలిపాడు. జైలు అధికారులు తనను మెంటల్ టార్చర్ పెడుతున్నారని చెప్పడంతో అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం నాటి కి జైలు సీసీ ఫుటేజీలు తమకు అందజేయాలని, మిషెల్ ను హై సెక్యూరిటీ సెల్ కు మార్చాలని తీహార్జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
*తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున పొల్లాచి వద్ద ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పరంబికుళం-అలియార్‌ ప్రాజెక్టు కెనాల్‌లో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి పొల్లాచి జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
*హైదరాబాద్‌లో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
*కరీంనగర్‌జిల్లా పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ ఎం.దిలీప్‌చంద్ర గోపాల్‌, దస్తావేజు లేఖరి తాడూరి వెంకట్‌ మంగళవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.
*తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణమైన డేటా చౌర్యం కేసులో ప్రధాన నిందితుడైన అశోక్‌ తెలంగాణ సిట్‌ ఎదుట బుధవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అతను విచారణకు హాజరవుతాడా? లేదా? అన్నది ఉత్కంఠంగా మారింది.
*చెరువు మధ్యలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల జెండాలను తొలగించేందుకు వెళ్లిన ఓ కూలీ నీటి మునిగి దుర్మరణం చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో మంగళవారం చోటుచేసుకుంది.
* పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం 30 కేజీల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి ఏలూరు వైపు వస్తున్న ఆడీ కారును ఉంగుటూరు మండలం నారాయణపురం టోల్‌ప్లాజా వద్ద తనిఖీ చేశారని, అందులో ఒక్కొక్కటి 100 గ్రాముల బరువున్న 300 బంగారు బిస్కెట్లు లభించాయని ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు.
*ఎన్నికల నియమావళి అమలులో అధికారులు నిమగ్నమయ్యారు. తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. నగదు రవాణా చేసే వారిపై నిఘా పెట్టి మొబైల్‌ చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి రహదారి బంగ్లా వద్ద చేసిన తనిఖీల్లో మంగళవారం ఒకరి నుంచి రూ.12.60 లక్షలు, మరొకరి నుంచి రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్‌ సీఐ చింతా రవిబాబు చెప్పారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఒక బృందంగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.
*శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం పలుచోట్ల జరిపిన వాహన తనిఖీల్లో రెండుచోట్ల రూ.14 లక్షలు పట్టుబడ్డాయని పోలీసులు తెలిపారు. ఒడిశాలోని బ్రహ్మపుర నుంచి కారులో పర్లాఖెముండికి రూ.5.99 లక్షలు చేరవేస్తున్న ఓ వ్యక్తిని ఇచ్ఛాపురంలో పట్టుకొన్నారు. ఒడిశాలోని పర్లాఖెముండి నుంచి జిల్లాలోని మెళియాపుట్టి మీదుగా పలాసకు వెళ్తున్న ఇద్దరినుంచి రూ.8లక్షలు స్వాధీనం చేసుకొన్నారు.
*ఒడిశాలో రహదారి నిర్మాణ పనుల సూపర్‌వైజర్‌ ఒకరిని మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. మల్కాన్‌గిరి జిల్లా మథిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుకుర్‌కండి గ్రామంలో ప్రభాత్‌ బిషోయి రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో సాయుధులైన 25 మంది మావోయిస్టులు ఆయనను చుట్టుముట్టారు.
* ప్రముఖ పుణ్యక్షేత్రం, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో కొలువైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో మంగళవారం ఆలయ ఈవో టి.వెంకటేశ్‌, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ సంపత్‌ ప్రసాదాల తయారీ, ప్రధాన నిల్వ కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
*రహదారి పనుల నిమిత్తం రూ.వెయ్యి కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణం పొంది, ఆపై పనుల్లో పురోగతి చూపలేదని ఆరోపిస్తూ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌, దాని సీఎండీ కె.శ్రీనివాసరావులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ సంస్థ డైరెక్టర్లు ఎన్‌.సీతయ్య, ఎన్‌.పృథ్వి తేజ, మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, మధుకాన్‌ ఇన్‌ఫ్రా, మధుకాన్‌ టోల్‌ హైవే లిమిటెడ్‌, కోటా అండ్‌ కంపెనీలతో పాటు పలువురు బ్యాంకు అధికారులనూ నిందితులుగా పేర్కొంది.
*ఐటీ కంపెనీల్లో స్టాళ్లు.. విదేశాల్లోని రెస్టారెంట్‌లలో ఉద్యోగాలు.. వ్యాపారంలో వాటా ఇప్పిస్తామంటూ నాలుగైదు కోట్లు దండుకుని మోసగించిన ఇద్దరు నిందితులను ఎస్‌వోటీ, నాచారం పోలీసులు అరెస్టు చేశారు.
*పరీక్ష తప్పుతాననే భయం, ఆందోళనతో ఇంటర్‌ విద్యార్థి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
*చార్మినార్‌, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మంగళవారం తృటిలో ప్రమాదాలు తప్పాయి.మార్గమధ్యంలో కొంతసేపు నిలిచిపోయిన ఆ బండ్లు.. ఆ తర్వాత కదిలాయి. ప్రయాణికుల అప్రమత్తత, అధికారుల సత్వర స్పందనే దీనికి కారణం. చెన్నై సెంట్రల్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌- తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కేసముద్రం రైల్వేస్టేషన్‌ దాటుతోంది.అదే సమయంలో మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ప్రాంతం ఇంటికన్నె స్టేషన్‌ వద్ద.. ముందు భాగంలోని ఓ బోగీ కింది నుంచి పొగలు వచ్చాయి. అవి లోపలికి వ్యాపించడంతో, భయాందోళన చెందిన ప్రయాణికులు గొలుసు లాగి నిలిపివేసి కిందికి దిగారు. సమాచారం అందుకున్న లోకో సిబ్బంది మరమ్మతు చేయడంతో, రైలు తిరిగి కదిలింది.
*చివరి పరీక్ష..అది కాస్తా పూర్తయ్యాక ఎంచక్కా స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుదామనుకున్నారా ఇద్దరు. అనేక ప్రణాళికలు వేసుకున్నారు. అనుకోని ఘటన వారి ఊహలను తలకిందులు చేసింది. బస్సు ప్రమాదం వారిలో ఒకరిని బలి తీసుకోగా..మరొకర్ని చావు అంచులకు తీసుకెళ్లింది.
* పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో భారీగా బంగారం పట్టుపడింది. కారులో తరలిస్తున్న బంగారు బిస్కెట్లను జాతీయ రహదారిపై ఉంగుటూరు పోలీసులు పట్టుకున్నారు.
*పెళ్లి వ్యాన్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఎర్రన్నగుడి వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో పార్వతీపురానికి చెందిన మహిళ మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
* కల్తీ మద్యం ఆరుగురి ప్రాణాలు తీసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘటమ్‌పూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*వరంగల్ జిల్లా దోర్నకల్ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా ములుగు జిల్లా పరిధిలోని ఎటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థి నరీన్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పదో తరగతి ఫెయిల్ అవుతాననే భయమే ఇందుకు కారణంగా సమాచారం.
*రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం ముష్ఠిపల్లి గ్రామానికి చెందిన యువకుడు చించు ఆంజనేయులు(
*ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో జరిగిన మరోప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన ఓ కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వివాహ వేడుకకు హాజరై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఖోర్మా గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల్ని గోరఖ్‌పూర్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com