ఇబ్రహీంపట్నంలో ఇండో-అమెరికా సైన్యాలు

అమెరికా-భారత్‌ భాగస్వామ్యంలో చేపట్టే సైనిక ఉత్పత్తులకు హైదరాబాద్‌ కేంద్ర స్థానంగా మారిందని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా తెలిపారు. జపాన్‌లోని ఒకినావాలో ఉన్న అమెరికా మిలటరీ మొదటి బెటాలియన్‌కు చెందిన స్పెషల్‌ ఫోర్సెస్‌ గ్రూప్‌ (వైమానిక విభాగం), హైదరాబాద్‌లోని జాతీయ భద్రత దళం(ఎన్‌ఎస్‌జీ) సంయుక్తంగా చేపట్టిన విన్యాసాలు బుధవారం మొదలయ్యాయి. ఇబ్రహీంపట్నంలోని ఎన్‌ఎస్‌జీ కేంద్రంలో రెండు వారాల పాటు విన్యాసాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రధాన భాగస్వామిగా అమెరికా గుర్తించింది. ఆ కోణంలో భారత-అమెరికా సైనిక బంధం చాలా దృఢమైనది. భవిష్యత్తులో అది మరింత బలపడుతుంది. అనూహ్య పరిణామాలు తలెత్తినప్పుడు భద్రత బలగాలను తక్షణమే రంగంలోకి దింపడం ద్వారా నష్టాన్ని నివారించేలా చూడటమే ఈ విన్యాసాల అసలు ఉద్దేశం. రెండు దేశాల భద్రత బలగాలు తమ కార్యాచరణ, సమన్వయం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగ సామర్థ్యం పెంపొందించుకునేందుకు ఇవి దోహదపడతాయి. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు అమెరికా బలగాలకు కూడా కీలకమే. కొత్త వాతావరణంలో భారతీయ భద్రత బలగాలతో కలిసి సమర్థంగా ఎలా పనిచేయాలో నేర్చుకునేందుకు ఇవి ఉపయోగపడ తాయి. భవిష్యత్తులో రెండు దేశాలు కలిసి పనిచేయగలవన్న నమ్మకాన్ని పెంపొందిస్తాయి. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, హవాయ్‌లోని అమెరికా స్పెషల్‌ ఆపరేషన్స్‌ పసిఫిక్‌ కమాండ్‌ అధిపతి హెచ్‌.ఎం.స్మిత్‌ వీటిని పర్యవేక్షిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా జరుగుతాయి’’ అని హడ్డా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com