చరిత్రలో మార్చి 14

🏞సంఘటనలు 🏞
🌹1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
🌺1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది
🌷2008: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.

🌻🌻జననాలు🌻🌻
🌸1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915)
🥀1879: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955)
🌼1917: కె.వి.మహదేవన్, సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
🌻1930: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (మ.2016)
💐1937: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.

🌹🌹మరణాలు🌹🌹
🍀1664: సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్‌కిషన్ ఢిల్లీలో మరణించాడు.
🌿1883: ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.
☘2013: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)

🔷జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు🔷
🔻పై డే : గణితంలో వాడే ఒక గుర్తు పేరు ‘పై’ (22/7). పై యొక్క విలువ 3.14159…. దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డేగా జరుపుకుంటున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com