హిందీలో విలక్షణమైన కథతో రూపొందే ఓ చిత్రంలో నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ అంగీకరించారా? కండోమ్ టెస్టర్‌గా కనిపించేందుకు ఆమె ‘యస్’ అన్నారా? అంటే… ‘అవును’ అని ముంబై వర్గాలు అంటున్నాయి. కండోమ్ కంపెనీలు తమ సంస్థలో రూపొందించిన నూతన ఉత్పత్తులను పరీక్షించేందుకు 18 ఏళ్లు నిండిన యువతీయువకులను ఉద్యోగంలో నియమించుకుంటాయి. అటువంటి పాత్ర చుట్టూ తిరిగే కథతో ఆర్‌ఎస్‌విపి నిర్మాణ సంస్థ రకుల్ సంప్రదించగా… సినిమా చేయడానికి తాను సిద్ధమన్నారట. పాత్ర బోల్డ్‌గా ఉన్నప్పటికీ… సినిమా వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం. ఆయుష్మాన్ ఖురానా చేసే చిత్రాల తరహాలో ఈ సినిమా ఉంటుందట. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గి, మళ్లీ షూటింగులు మొదలైన తర్వాత… ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని అనుకుంటున్నారు. తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కండోమ్ టెస్టర్‌గా రకూల్
Related tags :