Movies

నా బట్టలు నా ఇష్టం

నా బట్టలు నా ఇష్టం

వస్త్రధారణ, ఫ్యాషన్‌ విషయంలో తన అభిరుచుల మేరకు నడచుకుంటానని, ఇతరుల అంగీకారం కోసం ఆలోచించనని చెప్పింది శృతిహాసన్‌. ఫ్యాషన్‌ విషయంలో ఆది నుంచి ఈ సొగసరి ప్రత్యేక పంథాను ఫాలో అవుతుంటుంది. ముఖ్యంగా నలుపు వర్ణాన్ని ఎక్కువగా ఇష్టపడే పురాతన గోథిక్‌ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఈ విషయం గురించి శృతిహాసన్‌ మాట్లాడుతూ ‘ఫ్యాషన్‌ అంశంలో నాకు నచ్చినట్లుగానే ఉంటా. డార్క్‌ కలర్స్‌ పట్ల చాలా మంది అయిష్టత పెంచుకుంటారు. కానీ నాకు వాటిలో నిజమైన ప్రామాణికత కనబడుతుంది. మనలోని సహజమైన ఉద్వేగాలకు ప్రతీకలా ఆ రంగులు కనిపిస్తాయి. ఫ్యాషన్‌ వ్యక్తిత్వాన్ని ప్రతింబింబిస్తుంది కాబట్టి నా హృదయానికి నచ్చిన ైస్టెల్స్‌నే ఎంచుకుంటాను. ఇతరుల అంగీకారం కోసం ఆలోచిస్తే మన అభిరుచుల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. అందుకే వస్త్రధారణ, మేకప్‌ వంటి విషయాల్లో నా మనసునే ఫాలో అవుతా. నాకు సంతోషాన్నిచ్చే పనుల్నే చేస్తాను’ అని చెప్పుకొచ్చింది