చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది కేవలం నాలుగు దేవాలయాల అర్చకులు మాత్రమే పూజలు, ఇతర సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ వెల్లడించారు. మే 14 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో చార్‌ధామ్ దేవాలయాలు ఉన్నాయి. బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలను చార్‌ధామ్ అంటారు.
ఛార్‌ధామ్ యాత్ర రద్దు
Related tags :