కంచి కామాక్షీ అమ్మవారి విశేషాలు

కంచి అనగానే మనకు కామాక్షిదేవి పేరే గుర్తుకు వస్తుంది. ఆ నగరాన్ని స్మరిస్తేనే మోక్షం లభిస్తుంది. అందరూ దర్శించే కామాక్షీదేవి ఆలయానికి వెనుకవైపు ఒక ఆలయం ఉంది. అదే ఆదికామాక్షీదేవి ఆలయం. ఈ ఆలయాన్ని కాళీకొట్టమ్‌ (కాళీ కోష్టమ్‌) అనే పేరుతో కూడా పిలుస్తారు. ఒకానొక సమయంలో పార్వతీదేవి ఇక్కడ కాళీరూపంలో వెలసిందట. నాటినుండీ ఆమెకు ఆ పేరు ప్రసిద్ధమైంది.కంచి కామాక్షిదేవి ఆలయం కంటే ఇది ప్రాచీనమైనదని చెబుతారు. కామాక్షీదేవికి ముందు భాగంలో శక్తి లింగం ఒకటుంది. అమ్మవారి ముఖం లింగంపై ఉంటుంది. ఇది అర్ధనారీశ్వరలింగంగా పూజలందుకుంటోంది. కల్యాణం కాని వారు ఈ శక్తి లింగాన్ని పూజిస్తే తప్పక కల్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపచేశారట. గర్భగుడిలో ఆదికామాక్షీదేవి పద్మాసనంలో కూర్చుని అభయముద్రను, పానపాత్రను, పాశాంకుశాలనూ నాలుగు చేతులతో ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారి పీఠానికి కిందిభాగంలో మూడు శిరస్సులు దర్శనమిస్తాయి. వాటి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది.శిల్పకుశలురైన ధర్మపాలుడు, ఇంద్రసేనుడు, భద్రసేనుడు అనే ముగ్గురు కాంచీపురంలో తమ శిల్పాలను ప్రదర్శించడానికి వస్తారు. వారి శిల్పకళకు అచ్చెరువొందిన కంచిరాజు వారికి ఒక మాట ఇచ్చి తప్పుతాడు. దాంతో రాజుకు శిల్ప సోదరులకు యుద్ధం జరుగుతుంది. భీకరమైన ఈ యుద్ధాన్ని నివారించేందుకు కామాక్షీదేవి ప్రత్యక్షమై రాజుకు, ఆ శిల్పులకు సంధి చేస్తుంది. శిల్పులకు తన పాదసన్నిధిలో స్థానం కల్పించి అనుగ్రహిస్తుంది. ఈ కథ ధర్మపాలవిజయం పేరిట ప్రసిద్ధి పొందింది.సకలశుభాలనూ, సకల సిద్ధులనూ అనుగ్రహించే ఆదికామాక్షీదేవిని దర్శించి అభీష్టసిద్ధిని పొందండి
2. కాటమరాయుడికి దవనార్చన-15 నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
పరిమళాలు వెదజల్లే పరిసరాలు భగవంతుడి నివాస స్థలాలు.పరమాత్మను రకరకాల పువ్వులతో పూజించడం ఆనవాయితీ.చాలాచోట్ల తులసిని కూడా సమర్పిస్తారు. అయితే ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామికి మాత్రం దవనం సమర్పించడం సంప్రదాయం. శ్రీమహావిష్ణువు అలంకార ప్రియుడు.ఆయనే అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహస్వామిగా కొలువయ్యారని భక్తుల విశ్వాసం. స్వామివారు బ్రహ్మోత్సవాల్లో రోజుకో అలంకారంతో తిరువీధుల్లో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఖాద్రీసుని సువాసనలు వెదజల్లే దవనం, మల్లెలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. కాటమరాయుడికి, దవనానికి విశేషమైన సంబంధమే ఉంది. పాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలోనే దవనం పండడం భగవంతుని కృపే అన్న విశ్వాసం భక్తుల్లో ఉంది. అలాగే చైత్రమాస పౌర్ణమిని దవన పున్నమిగా ఇక్కడ నిర్వహిస్తారు. దవనానికి సువాసనతో పాటు రుగ్మతలను మాపే దివ్య ఔషద గుణం కూడా ఉంది. వేసవిలో చర్మసంబంధిత రుగ్మతలు వస్తుంటాయి. వాటిని రూపుమాపే గుణం దవనానికి ఉంది.ఏడాదిలో 364 రోజుల పాటు పూజలందుకున్న స్వామివారు రథోత్సవంనాడు దివ్య చైతన్యంతో ఉంటారని భక్తుల నమ్మకం. అందుకే ఆరోజు భక్తుల గోవిందనామ ఘోషతో రథం ముందుకెళ్తుంటే నృసింహునిపై దవనం, మిరియాలు చల్లి కోర్కెలు నెరవేర్చమని వేడుకుంటారు. చాలాకాలంగా వేధిస్తున్న రుగ్మతుల విముక్తికి భక్తులు రథం వెనక పొర్లుదండాలు పెడతారు. అలా చేసే సమయంలో నేలపై పడిన దవనం, మిరియాలు శరీరానికి తగలడం ద్వారా ఆ వ్యాధులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. కొందరు రథంపై నుంచి జారిపడిన దవనం, మిరియాలను ఇళ్లకు తీసుకెళ్లి ఏడాదంతా దాచుకుంటారు. రుగ్మతలకు ఔషదంగా వాడతారు.
3. నేడు యాదాద్రి నరసింహస్వామి ఎదుర్కోలు మహోత్సవం..
యాదాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో విశేష ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు రాత్రి శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. 15న శ్రీవారి తిరుకల్యాణం, 16న శ్రీస్వామివారి దివ్య విమానరథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, 15న కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా హాజరవుతారని ఈవో గీత తెలిపారు.
4. వైభవంగా మహా కుంభాభిషేకం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ లో తితిదే నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం మహా కుంభాభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం 6గంటల నుంచి 7గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా దీన్ని చేపట్టారు. వేడుక అనంతరం సామాన్య భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
5. సింహవాహనంపై మృగ నరహరి
యాదాద్రీశుడు సింహవాహనంపై విహరిస్తూ, బుధవారం తీర్థజనులకు నేత్రానందం కలిగించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ వార్షిక బ్రహ్మోత్సవాల ఆరో రోజు రాత్రి వాహన సేవోత్సవం అందరికీ కనువిందు చేసింది. లక్ష్మీసమేతుడై విహరించిన స్వామి..మధ్యాహ్నంవేళ పెళ్లికుమారుడి ముస్తాబుతో పాటు గోవర్ధన గిరిధారిగా దర్శనమిచ్చారు. అలంకార, వాహన సేవ సంబరాలతో క్షేత్రమంతా వైభవంగా అలరారింది. ప్రత్యేక పూజలు చేపట్టి, ఉత్సవ పర్వాలు నిర్వహించారు. విష్ణు సహస్రనామ పారాయణం, నిరంతర మంత్ర పఠనం, హవన పూజలు నిర్వర్తించారు. పర్వాల విశిష్టతను ఆలయ ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య వివరించారు. ఐదురోజులు నిర్వహించే ధార్మిక సాహిత్య సాంస్కృతికోత్సవాలను యాడా ఉపాధ్యక్షులు జి.కిషన్‌రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గురువారం జరిగే ఎదుర్కోలు ఉత్సవానికి ఏర్పాట్లు మొదలయ్యాయని పూజారులు తెలిపారు.
6. మరింత మందికి మహద్వార ప్రవేశం-తిరుమల జేఈవో శ్రీనివాసరాజు
శ్రీవారి ఆలయ మహద్వార ప్రవేశానికి సంబంధించి మఠాధిపతులు, పీఠాధిపతులతో పాటు దేశంలోని పలువురు అత్యంత ప్రముఖులకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. మఠాధిపతులు, పీఠాధిపతులకు శ్రీవారి ఆలయ మహద్వార ప్రవేశ నియమాలలో ఎలాంటి మార్పులు చేపట్టలేదని స్పష్టం చేశారు. ఆలయ మర్యాదలు పొందే మఠాధిపతులు, పీఠాధిపతులకు ఏడాదికి ఒకసారి ఐదుగురితో కలిసి మహద్వార ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా వారితోపాటు ఒక సహాయకుడికి మహద్వార ప్రవేశం కల్పిస్తున్నట్లు వివరించారు.
7. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే స్వామివారి సర్వ దర్శనానికి 6గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైంస్లాట్, నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 2గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
8. తిరుమల \|/ సమాచారం
ఈ రోజు గురువారం
14.03.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 15C° – 33C°
నిన్న 66,078 మంది
శ్రీవారి భక్తులకి కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి
వారి దర్శన
భాగ్యం కలిగినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 04
గదులలో భక్తులు
వేచియున్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
08 గంటలు పట్టవచ్చును,
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.34 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
9. చరిత్రలో ఈరోజు
1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది
2008: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.
**జననాల
*1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915)
*1879: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955)
*1917: కె.వి.మహదేవన్, సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
*1930: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (మ.2016)
*1937: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
**మరణాలు
*1664: సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్‌కిషన్ ఢిల్లీలో మరణించాడు.
*1883: ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.
*2013: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)
10. శుభమస్తు
తేది : 14, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 23 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 20 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 6 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 41 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 10 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 27 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 36 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 13 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 1 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 25 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 25 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 25 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : వృషభము

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com