కష్టాల్లో బోయింగ్-వాణిజ్య-03/14

*మానవ వనరుల అభివృద్ధి, నిర్వహణలో విశేష ప్రతిభ కనబర్చినందుకు సీఐఐ నేషనల్‌ హెచ్‌ఆర్‌ ఎక్సెలెన్స్‌ అవార్డును అమర రాజా బ్యాటరీస్‌ దక్కించుకుంది. 2019 సంవత్సరానికి గాను ఈ తొమ్మిదో విడత ‘ప్రైజ్‌’ పురస్కారాన్ని గోద్రెజ్‌ ఛైర్మన్‌ ఆది గోద్రెజ్‌ చేతుల మీదుగా సంస్థ గ్రూప్‌ హెచ్‌ఆర్‌ ప్రెసిడెంట్‌ జైకిషన్‌ బీ అందుకున్నారు.
*మార్కెట్ లో బంగారం, వెండి ధరలువివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,650, విశాఖపట్నంలో రూ.33,370, ప్రొద్దుటూరులో రూ.33,330, చెన్నైలో రూ.32,350గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,850, విశాఖపట్నంలో రూ.30,700, ప్రొద్దుటూరులో రూ.30,840, చెన్నైలో రూ.30,870గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,500, విశాఖపట్నంలో రూ.39,700, ప్రొద్దుటూరులో రూ.39,700, చెన్నైలో రూ.41,800 వద్ద ముగిసింది.
*వైస్రాయ్‌ హోటల్స్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ కంపెనీకి చెందిన కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ (సీఓసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అగ్రశ్రేణి ఆడిట్ సేవల సంస్థ అయిన గ్రాంట్ థార్టన్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీని ఫోరెన్సిక్‌ ఆడిట్ సంస్థగా ఎంపిక చేశారు. దీంతో వైస్రాయ్‌ హోటల్స్‌ ఖాతాల్లో ఏం జరిగింది…, ఏమైనా అభ్యంతరకరమైన లెక్కలు ఉన్నాయా…? అనే గుట్టు తేలిపోయే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.
*జీఎస్‌టీ మండలి తదుపరి సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. దీంతో జీఎస్‌టీ మండలి 32వ సమావేశం ఈ నెల 19న జరగనుంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గత ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
*అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలతో అంకురాలను అనుసంధానం చేసే విధంగా టి-హబ్‌ ఆర్కేడ్‌ సిరీస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మార్చి నుంచి ప్రతి నెలా ఒక విభాగంలో ఎంపిక చేసిన అంకురాలను ఆయా రంగాల్లోని పెద్ద సంస్థలతో కలిసి పనిచేసేందుకు అవసరమైన సహాయాన్ని జీఎస్‌టీ గ్లోబల్‌తో కలిసి అందించనుంది.
* కరీంనగర్‌ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన వాల్‌మార్ట్‌ విక్రయ కేంద్రంలో స్థానికులకే ఉపాధి అవకాశాలుంటాయని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ అన్నారు.
*2022-23 ఆర్థిక సంవత్సరం వరకు అదనంగా రూ.4,000-6,000 కోట్ల మూలధనం (ఎక్స్‌టర్నల్‌ కేపిటల్‌) సమకూర్చగలిగితే చిన్న బ్యాంకులు (స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు-ఎస్‌ఎఫ్‌బీలు) ఏటా 25-30 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉందని ఇక్రా నివేదిక పేర్కొంది. ఇంకా ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.
*భవన నిర్మాణ రంగంలో ఉపయోగించే అల్యూమినియం ప్యానెళ్ల తయారీకి అపర్ణా ఎంటర్‌ప్రైజెస్‌, హాంకాంగ్‌కు చెందిన క్రాఫ్ట్‌ హోల్డింగ్స్‌తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలూ ఉమ్మడిగా అపర్ణా-క్రాఫ్ట్‌ ఎక్స్‌టీరియర్స్‌ పేరుతో ఈ ఉత్పత్తులను తీసుకు రానున్నాయి.
* హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) 150 సీసీ బైకు సీబీ యూనికార్న్‌లో యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ (ఏబీఎస్‌) కలిగిన కొత్త బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.78,815 (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు.
*విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. విప్రోలో తన 34 శాతం షేర్లను అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com