జయరాం హత్య కేసులో ట్విస్ట్–నేరవార్తలు–03/14

* ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. సినీనటుడు సూర్యప్రసాద్‌, కిశోర్‌, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాం హత్య విషయం ముందే తెల్సినా అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, హత్యకు పరోక్షంగా సూర్య, కిషోర్‌ సహకరించడంపై విచారణ చేపట్టారు. ఈ ముగ్గురిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
*విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏటీఎం మెషిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో మంటలు వ్యాప్తిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
* ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం, కుప్పెనకుంట దగ్గర గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న సత్తుపల్లికి చెందిన బాలు(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*చిత్తూరు జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో టాటా ఏస్‌ వాహనంలో తరలిస్తున్న రూ.1.09 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు కొన్ని క్రీడా సామగ్రిని కూడా సీజ్‌ చేశారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో ఈ నగదు పట్టుబడింది. తమిళనాడు నుంచి తిరుపతి తరలిస్తుండగా పోలీసులు వీటిని పట్టుకున్నారు.
* హైదరాబాద్‌ రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్లు చోటుచేసుకున్న దుర్ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో రహదారి పక్కన ఉన్న దిమ్మెను బైక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ విద్యార్థి మృతిచెందాడు. విద్యార్థులు పొన్నారం పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌ సాయినాథ్‌ కాలనీలో పాఠశాల బస్సు ఢీకొని రెండేళ్ల బాలుడు రోహన్‌ మృతిచెందాడు.
* ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్ నందుగావ్ జిల్లా పరిధిలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ పోలీసులు పక్కా సమాచారం తో గట్ఫార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. నక్టిఘటి అడవి ప్రాంతంలో మావోయిస్ట్ డంపును కనుగొని అందులో నక్సలైట్ సాహిత్యం భారీ పరిమాణంలో, 14. డాటానేటర్, 1 పీపీ బాంబ్, గన్ పౌడర్, జోడి పిత్, రోజూ వారి సామాగ్రి అండ్ లిటరేచర్ బారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్ట్ డంపు ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని జిల్లా ఎస్పీ తెలిపారు.
* మందమర్రి మండలం వెంకటాపూర్‌లో రోడ్డు ప్రమాద జరిగింది. రోడ్డు పక్కన ఉన్న దిమ్మను బైక్ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో పదోతరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా ఒక విద్యార్థి చనిపోయాడు. విద్యార్థులు పొన్నారం హైస్కూల్‌లో పదోతరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిగితా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
* అనంతపురం జిల్లాలోని ఆయా ఏరియాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 32 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని గుంతకల్లు సబ్ డివిజన్ పరిధిలోని విడపనకల్లు, గుంతకల్లు పోలీసు‌స్టేషన్‌ల పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా వాహనాల్లో తరలుతున్న రూ. 32 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. కాగా.. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతున్న సంగతి తెలిసిందే.
* కాజా టోల్ గేట్ సమీపంలో అధికారులు తనిఖీలు…ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు లో అనుమానాస్పదంగా బాక్స్ లో పెట్టిన నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు.
* తిరుపతి సమీపంలోగల వడమాలపేట దగ్గర ఉన్న టోల్‌ప్లాజా దగ్గర రూ.1.1 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.టోల్ ప్లాజా దగ్గర పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి తిరుపతి వైపు వస్తున్న ఓ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో రూ. 1.1కోట్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా… ఈ డబ్బును ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు తీసుకువస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
* హైదరాబాద్ తెలంగాణా మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన 35 మంది విద్యార్థినులు… విద్యార్థులను ఆస్రా హాస్పిటల్ కు తరలింపు.సెక్రటరీ షఫివుల్లా నిర్లక్ష్యం తోనే ఇలా జరిగిందని విద్యార్థుల ఆందోళనషఫివుల్లా ను తొలగించాలని తల్లితండ్రుల నిరసనలు
*బ్రెజిల్‌లోని సావోపాలోలో ఓ పాఠశాలలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో పలువురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. సుజానోలోని పాఠశాలలోకి ఓ వ్యక్తి ప్రవేశించి కాల్పులు జరపడంతో పలువురు మరణించారని సావోపాలో రాష్ట్ర సాయుధ పోలీసు విభాగం తెలిపింది. ఈ కాల్పుల్లో 17 మంది వరకు గాయపడినట్లు బ్రెజిల్‌ టెలివిజన్‌ ఛానళ్లు వెల్లడించాయి.
*మానవత్వం మంట కలిసింది. బంధువైన వ్యక్తి అని నమ్మి సాయం కోరితే ఆ మానవ మృగం 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టింది. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో జరిగింది. నరసరావుపేట డీఎస్పీ డి.రామవర్మ మంగళవారం వివరాలను వెల్లడించారు.
*నిద్రిస్తున్న భార్యపై భర్త దాడిచేసి రెండు కాళ్లను నరికిన సంఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడు ఎస్సీకాలనీలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
*ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా రూ.29.91 కోట్ల నగదు, 13.577 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించింది.
*ఎన్నికల నేపథ్యంలో నగదు తరలింపులపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిఘా పెట్టారు. కర్నూలు, కడప, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో బుధవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.1.89 కోట్ల నగదు, 4.7 కిలోల బంగారం, లక్షల రూపాయల చీరలు, రోల్డుగోల్డ్‌ నగలు పట్టుకున్నారు.
* కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ వ్యక్తి సహా ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు నీటమునిగి మృత్యువాత పడ్డారు. దుర్ఘటన తమిళనాట కోయంబత్తూరు వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది.
*ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా తుముడిబందొ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతిచెందింది.
*అత్త మరణంతో ఆనందం వ్యక్తం చేసిన కోడలు హత్యకు గురైంది. ఓ పక్క నా తల్లి చనిపోతే ఆనందపడతావా.. అంటూ ఆమె భర్తే అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తు నుంచి తోసి చంపేశాడని పోలీసులు తెలిపారు.
*ఖలిస్థాన్‌ కమాండో ఫోర్స్‌(కేసీఎఫ్‌) ఉగ్రవాది, 1984లో చేపట్టిన ‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’ సందర్భంగా హతమైన ఆ సంస్థ అధ్యక్షుడు జర్నైల్‌సింగ్‌ భిందర్‌వాలే అనుచరుడైన గుర్‌సేవక్‌సింగ్‌(53)ను దిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
*డేటా చౌర్యం కేసులో ప్రధాన నిందితుడైన డాకవరపు అశోక్‌ విచారణకు గైర్హాజరయ్యాడు. బుధవారం తమ ఎదుట హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అశోక్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ అతని జాడలేదు.
* నైజీరియాలోని లాగోస్‌లో నాలుగంతస్తుల పాఠశాల భవనం బుధవారం కుప్పకూలిన ఘటనలో కనీసం వందమందికి పైగా శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో చాలామంది మరణించి ఉండవచ్చని ‘గార్డియన్‌ నైజీరియా’ పేర్కొంది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు ఆర్‌పీసీ(రెవల్యూషన్‌ పీపుల్స్‌ కమిటీ)కి చెందిన ముగ్గురిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. మిలీషియా కమాండర్‌, సభ్యులుగా వ్యవహరించే వారి నుంచి పలు జిలెటిన్‌ స్టిక్స్‌, డిటొనేటర్లు, విద్యుత్‌ తీగలతో సహా ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
*ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్‌ ప్రాంతం గట్ఫార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర సామగ్రిని బుధవారం సీఆర్‌పీఎఫ్‌, డీఆర్‌జీ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.నక్టిఘటి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినవారు డంప్‌ను కనుగొని వెలికితీశారు. ఇందులో డిటోనేటర్లు, ఐఈడీ బాంబులు, గన్‌ పౌడర్‌ ఉన్నాయన్నారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు ఆర్‌పీసీ(రెవల్యూషన్‌ పీపుల్స్‌ కమిటీ)కి చెందిన ముగ్గురిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు.
* ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్‌ ప్రాంతం గట్ఫార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర సామగ్రిని బుధవారం సీఆర్‌పీఎఫ్‌, డీఆర్‌జీ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.నక్టిఘటి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినవారు డంప్‌ను కనుగొని వెలికితీశారు. ఇందులో డిటోనేటర్లు, ఐఈడీ బాంబులు, గన్‌ పౌడర్‌ ఉన్నాయన్నారు.
*ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో అతనికి తెలియకుండా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి వ్యక్తిగత సమాచారం సేకరించి.. రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన ఘటనిది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన వనమా కిరణ్‌కుమార్‌ అనే వ్యాపారి.. దార్ల శ్వేత వద్ద పెట్రోల్‌ బంక్‌ను కొనుగోలు చేశారు.
*రాజధాని హైదరాబాద్‌లో విక్రయించేందుకు నెల్లూరు నుంచి మాదక ద్రవ్యాల్ని తీసుకొస్తున్న ముఠాసభ్యులు రాచకొండ పోలీసులకు చిక్కారు.
*తాను ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందన్న కోపంతో ఓ యువకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. పెళ్లిపీటలపైనే ఆమెను తుపాకీతో కాల్చి చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయ్‌బరేలీ జిల్లాలోని గాజియాపుర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన బ్రిజేంద్ర, ఆశ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
*తిరుమల సమీపంలోని అడవిలో కార్చిచ్చు రేగడంతో ఎకరా అటవీ ప్రాంతం బూడిదైంది. శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున నిర్మిస్తున్న రింగురోడ్డుకు ఆనుకొని ఉన్న అడవిలో పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన కాకులకొండ, ఫ్యాన్లగుట్ట వాచ్‌టవర్ల సిబ్బంది అటవీశాఖ అధికారి శివకుమార్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక దళంతో పాటు భద్రత, అటవీశాఖ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com