లోక్ సభ వైపు రాధ చూపు–రాజకీయ–03/14

* లోక్‌ సభ బరిలో దిగే యోచనలో వంగవీటి రాధా ఉన్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర వైపు రాధా మొగ్గు చూపుతున్నారు. నరసాపురం, అనకాపల్లి లోక్‌ సభ స్థానాల నుండి రాధా పోటీపై అధిష్టానం పరిశీలిస్తోంది. అనకాపల్లి వైపు రాధా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ రోజు (గురువారం) సాయంత్రానికి రాధా పోటీపై క్టారిటీ వచ్చే అవకాశం ఉంది.
* రెండో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, మరో 21 మంది పోటీచేసే అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో మహారాష్ట్రలో ఐదు స్థానాలకు, ఉత్తర ప్రదేశ్‌ లో 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. సీనియర్ నేత, నటుడు రాజ్ బబ్బర్ మోరాదాబాద్ నుంచి పోటీలో దిగనుండగా, సంజయ్ దత్ సోదరి ప్రియాదత్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి బరిలోకి దిగుతారని కాంగ్రెస్ తెలిపింది. ప్రియాంక గాంధీకి సన్నిహితుడిగా పేరున్న లలితేశ్ త్రిపాఠి మీర్జాపూర్ నుంచి బరిలోకి దిగనున్నాడు
* చిరంజీవికి హైకోర్టులో ఊరట
2014లో నమోదైన కేసు నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఊరట లభించింది. అప్పట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, రాత్రి 10 గంటల తరువాత కూడా ప్రచారం చేశారని చిరంజీవిపై కేసు నమోదైంది. గుంటూరు పరిధిలోని అరండల్ పేట పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేస్తూ, చిరంజీవి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగాలు నమోదుచేశారు. ఈ చార్జ్ షీట్ ను కిందికోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి టీ రజని చేపట్టారు. తమ క్లయింట్ ప్రచారం ముగించుకుని వస్తుండగా,క్రమ కేసు పెట్టారని చిరంజీవి తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు, కేసును కొట్టివేస్తూ తీర్పిచ్చారు.
* ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది
ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదుఎన్నికల సంఘానికి రాజకీయాలు అపాదించొద్దు…..ఏ రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం కొమ్ము కాయదు……ఎవరికి నచ్చిన అన్వయం వారు ఇచ్చుకోవద్దు…..నిబంధనల ప్రకారమే ఎన్నికల సంఘం వ్యవహరిస్తుంది.ఎన్నికల ప్రక్రియ మీద విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించవద్దు…..20వ తేదీలోపు ఫారం-7 దరఖాస్తులను క్లియర్ చేస్తాం….165 నియోజకవర్గాలలో దరఖాస్తుల పరిశీలన పూర్తిఎన్నికల ప్రక్రియలో సంఘానిది రిఫరీ పాత్ర మాత్రమే, ఎవరి పక్షాన పని చేయదురాష్ట్ర వ్యాప్తంగా 9,44,825 ఫారం-7 మొత్తం దరఖాస్తులు6,10,143 దరఖాస్తుల తిరస్కరణ., 2,58,852 దరఖాస్తుల అమోదం ఇప్పటి వరకు 1,42,408 డూప్లికేట్ ఓట్లను తొలగింపుజిల్లా యంత్రాంగాల నుంచి క్షేత్ర స్థాయి నివేదికలు రాకుండా ఓట్ల తొలగింపు సాధ్యపడదుఫారం-7 దరఖాస్తులపై రాష్ట్ర వ్యాప్తంగా 440 కేసుల నమోదురాష్ట్ర వ్యాప్తంగా 30కోట్ల నగదు., 16కేజీల బంగారాన్ని సీజ్ చేసిన పోలీసులు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కొత్త ఓట్ల కోసం 3,57,539 ఫారం -6 దరఖాస్తులు మార్చి 15నాటికి పదిలక్షల దరఖాస్తులు రావొచ్చని అంచనా 2015-17 మధ్య వేర్వేరు సర్వేలలో.., వేర్వేరు కారణాలతో 25లక్షల ఓట్ల తొలగింపు 2014 ఓటర్లతో పోలిస్తే 2019లో గణనీయంగా తగ్గిన ఓట్ల సంఖ్య ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఓట్ల తగ్గుదల.
* సత్తెనపల్లి నుంచే రెండోసారి పోటీ: కోడెల
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీకి దిగుతున్నానని శాసనసభాపతి కోడెల శివప్రసాద రావు ప్రకటించారు. మార్చి 22వ తేదీన నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం విలేకర్లతో మాట్లాడారు. పార్టీలో అభిప్రాయ భేదాలను సరిచేసుకుంటామని చెప్పారు. తన కుటుంబ సభ్యుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని హామీ ఇస్తున్నానని తెలిపారు. సత్తెనపల్లిలో 15వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
*21 మందితో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా
ముంబై సౌత్ నుంచి మిలింద్ డియోరా పోటీ చేయనున్నారు.సోలాపూర్ నుంచి సుశీల్ కుమార్ షిండేమాజీ కేంద్రమంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ కాన్పూర్ నుంచి పోటీలోకి దిగనున్నారు. ముంబై నార్త్ సెంట్రల్ నుంచి ప్రియాదత్స్థానాలకు ప్రకటించింది. యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ మోరాదాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నేత సంజయ్ సింగ్ సుల్తాన్ పూర్ నుంచిస్థానాలకు అభ్యర్థులకు ప్రకటించగా..మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ 21 మంది ఎంపీ అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది.
* ఎన్నికల నోటిఫికేషన్ల విడుదలకు రాష్ట్రపతికి కేంద్రం సిఫార్సు
లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రపతిని కోరింది. ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన సిఫార్సులకు అనుగుణంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని సూచించింది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్‌ 11న జరిగే తొలి దశ పోలింగ్‌కు ఈ నెల 18న నోటిఫికేషన్‌ రానుంది. ఈసీ ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 14 ప్రకారం వాటిపై నోటిఫికేషన్లు ఇవ్వాలని సూచిస్తూ న్యాయశాఖకు సిఫార్సు చేసింది. నియోజకవర్గాల వారీగా ఎన్నికల తేదీలను ఇందులో పొందుపరిచింది. న్యాయశాఖ దాన్ని మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లింది. పరిశీలించిన మంత్రివర్గం..నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది.
* ఎన్నికల వ్యయం రూ.15వేల కోట్లు!- అసోచామ్‌ అంచనా
గత డిసెంబరులో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకం బాగా పడిపోయింది. జనవరిలోనూ అదే పరిస్థితి. ఆ నెలలో కార్ల అమ్మకాల్లో 2.65 శాతం, ద్విచక్ర వాహనాల విషయంలో 5.18 శాతం మేర తిరోగమనం నమోదయింది. మార్చిలో పరిస్థితి మారింది. షోరూంలు కిటకిటలాడుతున్నాయి. బల్క్‌ ఆర్డర్లు కూడా వస్తున్నాయని భారత వాహన తయారీదార్ల సంఘం డిప్యూటీ డైరెక్టర్‌ సౌగత్‌ సేన్‌ చెప్పారు. దీనికంతటికీ కారణం ఎన్నికలు రావడమే. ప్రచారం కోసం రాజకీయ నాయకులు భారీగా వాహనాలు కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారం పుంజుకొంది. ఇలాంటి ‘బూమ్‌’ విమానయానం, హోటళ్ల రంగాల్లో కూడా కనిపిస్తోంది. మద్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
*పట్టుబడ్డ నగదు రూ.29.91 కోట్లు
ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 29.91 కోట్ల నగదు 13.577కిలోల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. పెలుగు పదార్దాలను కూడా స్వాదీనం చేసుకున్నామని వివరించింది. ఎన్నికల షెడ్యుల్ విడుదలైన వెంటనే నియమావళి అమలు పర్యవేక్షణ కోసం రాష్ట్ర జిల్లా స్థాయిలలో నోడల్ అధికారులను ఏర్పాటు చేశామని పేర్కొంది.
*బాపట్ల ఎమ్మెల్యే కోనకి టికెట్‌ ఇవ్వవద్దంటూ నిరసన
వైకాపా అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో బుధవారం లోటస్‌పాండ్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం, పార్టీ అధ్యక్షుడు జగన్‌ నివాసం ముందు సందడి నెలకొంది. టిక్కెట్‌ తమ నాయకునికే కేటాయించాలని కొందరు, ఫలానా నేతకు వద్దని కొందరు ఆందోళనలు చేపట్టారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి టిక్కెట్‌ కేటాయించవద్దని అదే పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
*చంద్రబాబు పిటిషన్‌పై రేపు విచారణ
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి నియోజకవర్గంలో కనీసం 50శాతం వీవీప్యాట్లు లెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏదో ఒక పోలింగ్‌ కేంద్రంలోనూ, పార్లమెంటు పరిధిలో అయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏడు పోలింగ్‌ కేంద్రాల వీవీప్యాట్‌లను ఎన్నికల సంఘం లెక్కిస్తోంది. వీవీప్యాట్‌ల లెక్కింపు ఏదో ఒక్క పోలింగ్‌ కేంద్రానికి నమూనాగా పరిమితం చేయకూడదని, కనీసం 50శాతం పోలింగ్‌ కేంద్రాల్లోని వీవీప్యాట్‌లు లెక్కించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఈ నెల 2న పిటిషన్‌ నమోదు కాగా, పత్రాలను రిజిస్ట్రీ ఈ నెల 6న పరిశీలించింది.
*జగన్‌ నుంచి ప్రధాని మోదీకి ముడుపులు: బుద్ధా
తన అక్రమాస్తుల కేసుపై సీబీఐ ముందుకు వెళ్లకుండా తొక్కిపెట్టినందుకు ప్రధాని మోదీకి వైకాపా అధ్యక్షుడు జగన్‌ నుంచి ముడుపులు అందాయని మండలి విప్‌ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద వెంకన్న బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘మోదీ ఆదేశాల వల్లే జగన్‌ కేసులో సీబీఐ కఠినంగా వ్యవహరించలేదు. జగన్‌, విజయసాయిరెడ్డిలను అరెస్టు చేయలేదు. దేశానికి కాపలాదారునంటున్న మోదీ నిజంగా కాపలాగా ఉంటున్నది దేశానికా? జగన్‌ అక్రమాస్తులకా? నిజాయితీగా ఉన్న సంస్థలు, తెదేపా సానుభూతిపరులపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్న మోదీ.. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇలా ఎందుకు వ్యవహరించారో ప్రజలకు చెప్పాలి’ అని వెంకన్న డిమాండ్‌ చేశారు.
*మీ దీవెనలు చాలు కన్నా!-భాజపా అధ్యక్షుడి ఇంటికి వైకాపా అభ్యర్థి
చిత్రంలో చిరునవ్వు చిందిస్తున్నది భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఆయనతో కరచాలనం చేస్తున్న వ్యక్తి పేరు చంద్రగిరి ఏసురత్నం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి. బుధవారం కన్నావారితోటలోని తన కార్యాలయంలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలంటూ ఆయన ఆశీస్సులు కోరారు. మందహాసంతో కన్నా ఓకే అనగానే ఏసురత్నం నవ్వుతూ అక్కడ నుంచి నిష్క్రమించారు. ఈ సందర్భంగా తీసిన చిత్రమే ఇది.
*దేవెగౌడ కంట కన్నీరు
మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవెగౌడ మనసు గాయపడింది. తన పార్టీపై వస్తున్న విమర్శలను భరించలేక వెక్కివెక్కి ఏడ్చారు. మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణను హాసన జనతాదళ్‌ ఎంపీ అభ్యర్థిగా ఆయన బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన పార్టీని కుటుంబసభ్యుల పార్టీ అంటూ స్వపక్షంతో పాటు ప్రతిపక్షాలు ఆరోపించటం సరికాదంటూ భావోద్వేగానికి గురయ్యారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు, బెంగళూరు నగరంలో ముస్లింలకు అవకాశం కల్పించిన మా పార్టీ ఎవరికి అన్యాయం చేసిందో చెప్పాలంటూ దేవెగౌడ ప్రశ్నించారు. తాను హాసనలో నిలబడి గెలిచినా ఐదేళ్ల పాటు పనిచేస్తానన్న విశ్వాసం లేదన్నారు.
*తెరపైకి కొత్త పేర్లు
గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం యోచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రంగంలో లేని పలువురు నేతల పేర్లపైనా కసరత్తు చేస్తున్నారు. దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ నివాసంలో ఆయన, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోస్‌ రాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌, సలీం అహ్మద్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యర్థుల ఎంపికపై మంగళవారం అర్ధరాత్రి వరకు కసరత్తు చేశారు. కుంతియా, ఉత్తమ్‌, భట్టి బుధవారం మరో దఫా సమావేశమయ్యారు. మరింత బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏఐసీసీ ముఖ్య నేతలు సూచించడంతో పలు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి.
*ఎంపీగా పోటీకి సిద్ధమే: రేవంత్‌రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమేనని ఆయన ప్రకటించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధిష్ఠానం ఆదేశిస్తే నాయకుడిగా నడుచుకోక తప్పదన్నారు. బుధవారం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో రేవంత్‌రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఉన్నాయని పోరాడే సమయంలో పోరాడాల్సిందేనని, ఇది నాయకుడిగా తన బాధ్యత అని అన్నారు. శాసనసభ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిచిన భాజపా.. ఆ తర్వాత కేవలం మూడు నెలల్లో జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు.
*నేడు ఏపీలో తెదేపా అభ్యర్థుల ప్రకటన!
లోక్‌సభ, శాసనసభలకు తెదేపా తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధిష్ఠానం గురువారం విడుదల చేయనుంది. 120కి పైగా శాసనసభ, 14 వరకు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక సుదీర్ఘంగా సాగేది. నామినేషన్ల గడువు ముగిసే ముందురోజు అర్ధరాత్రి వరకూ స్పష్టత రాని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందుకు భిన్నంగా నామినేషన్ల ప్రారంభానికి ముందే అధిక సంఖ్యలో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఈ దఫా ఖరారు చేయడం విశేషం. గత కొద్ది రోజులుగా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలను ఉండవల్లికి ఆహ్వానించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
*ఓటు వేయడం ప్రాథమిక విధి
ఓటు వేయడం పౌరుల ప్రాథమిక విధి అని, ఓటు వేయడమంటే దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందరూ ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రజల్లో స్ఫూర్తి నింపాలని వివిధ రంగాల ప్రముఖులను కోరుతూ ట్వీట్లు చేశారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలంటూ ప్రణబ్‌ ముఖర్జీ, రాహుల్‌గాంధీ, మమతా బెనర్జీ, రతన్‌ టాటా, అమితాబ్‌, వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌, పి.వి.సింధు, లతా మంగేష్కర్‌, ఎ.ఆర్‌.రహ్మాన్‌, నాగార్జున తదితర ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు.
*ఇంద్రన్న ఆశయాలు సాధిద్దాం
మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డిలకు తెరాసలో మంచి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. తెరాసలో చేరాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. ఆమెను ఇంటి ఆడబిడ్డలా చూసుకుంటామని, వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పినట్లు తెలిసింది. దివంగత ఇంద్రారెడ్డి ఆశయాలను సాధిద్దామని.. తెలంగాణను, రంగారెడ్డి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే క్రతువులో కలిసి రావాలని సూచించారు.
*జనసేన తొలి జాబితా విడుదల
జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలైంది. 4 లోక్‌సభ స్థానాలకు, 32 శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఖరారు చేసిన అభ్యర్థుల్లో మాజీ మంత్రులు రావెల కిషోర్‌ బాబు, పసుపులేటి బాలరాజు, మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్‌, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ తదితర ముఖ్యులున్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకూ టికెట్లు ఇచ్చారు. తొలి నుంచి పార్టీలో లేకుండా అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 8 మందికి టికెట్లు కేటాయించారు. జాబితాలో పారిశ్రామిక వేత్తలు, విశ్రాంత అఖిల భారత సర్వీసు అధికారులున్నారు.
*అంబానీ, అదానీలే అభివృద్ధి చెందారు
మోదీ పాలనలో అంబానీ, అదానీలు మాత్రమే అభివృద్ధి చెందారని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్‌ కారాట్‌ ఆరోపించారు. తమిళనాడులోని కడలూరు జిల్లా నైవేలిలో మంగళవారం సాయంత్రం జరిగిన సీపీఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ… యువకులకు ఉద్యోగావకాశాలు, రైతులకు అదనపు ఆదాయం, మహిళల భద్రత వంటి అనేక హామీలను గత ఎన్నికలలో భాజపా ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక అవేమీ చేయలేదని ఆరోపించారు. గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ప్రైవేటుకు అమ్మే ప్రయత్నమే ఇందుకు కారణమని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని ఆరోపించారు. మతవాదానికి వ్యతిరేకంగా, ప్రజల జీవనాధారాన్ని కాపాడేందుకు రాజకీయపరంగా పరిష్కారం కనుగొనాలని సూచించారు.
*కన్నీరు పెట్టిన దేవెగౌడ
మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవెగౌడ మనసు గాయపడింది. తన పార్టీపై వస్తున్న విమర్శలను భరించలేక వెక్కివెక్కి ఏడ్చారు. మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణను హాసన జనతాదళ్‌ ఎంపీ అభ్యర్థిగా ఆయన బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన పార్టీని కుటుంబసభ్యుల పార్టీ అంటూ స్వపక్షంతో పాటు ప్రతిపక్షాలు ఆరోపించటం సరికాదంటూ భావోద్వేగానికి గురయ్యారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు, బెంగళూరు నగరంలో ముస్లింలకు అవకాశం కల్పించిన మా పార్టీ ఎవరికి అన్యాయం చేసిందో చెప్పాలంటూ దేవెగౌడ ప్రశ్నించారు. తాను హాసనలో నిలబడి గెలిచినా ఐదేళ్ల పాటు పనిచేస్తానన్న విశ్వాసం లేదన్నారు. ఈ
*తెరాస గెలిచినా దిల్లీలో చేసేదేం లేదు
తెలంగాణలో తెరాస గెలిచినా, దిల్లీలో చేసేదేమీ లేదని, ప్రధాని నరేంద్రమోదీని లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తేనే దేశం సురక్షితంగా ఉంటుందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.భాజపా ప్రజల అభిప్రాయాల మేరకే నడుచుకునే పార్టీ అని, ఆ మేరకే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తామని వ్యాఖ్యానించారు. ‘భారత్‌ కే మన్‌కీ బాత్‌ మోదీ కే సాత్‌’ కార్యక్రమంలో భాగంగా భాజపా ఎన్నికల మేనిఫెస్టో తయారీకి దేశవిదేశాల్లోని తెలుగువారితో హైదరాబాద్‌లోని శ్యాంప్రసాద్‌ ముఖర్జీ భవన్‌ నుంచి బుధవారం రాత్రి ‘ఫేస్‌బుక్‌ లైవ్‌’లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుచేయాలని.. తెలంగాణకు వందేమాతరం ఎక్స్‌ప్రెస్‌ను వేయాలని, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కింద ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాలని ప్రజలు అభిప్రాయపడినట్లు భాజపా వర్గాలు తెలిపాయి.
*బెంగాల్‌ను సమస్యాత్మక రాష్ట్రంగా ప్రకటించండి
స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పశ్చిమబెంగాల్‌ను ‘అత్యంత సమస్యాత్మకంగా రాష్ట్రం’గా ప్రకటించాలని భాజపా బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) కోరింది. ఆ రాష్ట్రంలోని ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కచ్చితంగా కేంద్ర బలగాలు ఉండేలా చూడాలని డిమాండ్‌ చేసింది. కేంద్ర మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, నిర్మలా సీతారామన్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు భూపేందర్‌ యాదవ్‌, కైలాస్‌ విజయవర్గియాలతో కూడిన బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి తమ డిమాండ్లను వివరించింది. ఈ భేటీ అనంతరం రవిశంకర్‌ ప్రసాద్‌ విలేకరులతో మాటాడుతూ కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను ఎన్నికల విధుల నుంచి ఉపసంహరించాలని, ఆరోపణలు వచ్చిన పోలీసు అధికారులను బదిలీ చేయాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
*పర్చూరు వైకాపా అభ్యర్థిగా దగ్గుబాటి?
ప్రకాశం జిల్లాలోని పర్చూరు శాసనసభ స్థానం నుంచి వైకాపా తరఫున సీనియర్‌ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కుమారుడు హితేష్‌ చెంచురాంను పోటీలో దించాలని ప్రయత్నాలు జరిపినా, ఆయనకు అమెరికా పౌరసత్వం ఇంకా రద్దవని కారణంగా భారత పౌరతస్వం రాలేదు. ఈ దస్త్రం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ పరిశీలనలోనే ఉండడంతో పరిష్కారానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. భారత పౌరసత్వం లేనివారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. దీంతో వెంకటేశ్వరరావునే పోటీలోకి దించాలని వైకాపా యోచిస్తోంది. ఆయన సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. దీనిపై వైకాపా అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గత నెలలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో కలిసి దగ్గుబాటి హితేష్‌ వైకాపాలో చేరారు. ఆ సమయంలో వెంకటేశ్వరరావు వైకాపాలో చేరలేదు. పార్టీ కండువా వేసుకోలేదు.
*యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా మరోసారి లోకేశ్‌
ప్రపంచ యువ నాయకుడిగా ఏపీ మంత్రి లోకేశ్‌ను ప్రపంచ ఆర్థిక వేదిక మరోసారి ఎంపిక చేసింది. 2019 యంగ్‌ గ్లోబల్‌ లీడర్ల జాబితాను ప్రపంచ ఆర్థిక వేదిక బుధవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో లోకేశ్‌ కీలకపాత్ర పోషించారని జాబితాలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 127 మందిలో దక్షిణ ఆసియాకు చెందిన 12 మంది ఉన్నారు. భారత్‌ నుంచి ఇప్పటివరకు ‘ప్రజాకర్షక’ జాబితాలో ఆరుగురికి అరుదైన గౌరవం లభించింది. ఐదేళ్లపాటు యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా ప్రపంచ ఆర్థిక వేదికలో మంత్రి లోకేశ్‌ ఇదివరకే కొనసాగుతున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తావించారు.
*అభివృద్ధి చెందింది అంబానీ, అదానీలే
మోదీ పాలనలో అంబానీ, అదానీలు మాత్రమే అభివృద్ధి చెందారని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్‌ కారాట్‌ ఆరోపించారు. తమిళనాడులోని కడలూరు జిల్లా నైవేలిలో మంగళవారం సాయంత్రం జరిగిన సీపీఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ… యువకులకు ఉద్యోగావకాశాలు, రైతులకు అదనపు ఆదాయం, మహిళల భద్రత వంటి అనేక హామీలను గత ఎన్నికలలో భాజపా ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక అవేమీ చేయలేదని ఆరోపించారు.
*ఎవరినీ కాపాడాల్సిన అవసరం మోదీకి లేదు
ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఎవరినీ కాపాడాల్సిన అవసరం లేదని భాజపా జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ కేసుల విచారణలో తాజా పరిణామాలపై విజయవాడలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘కేంద్ర విచారణ సంస్థలు స్వతంత్రంగా కేసులు విచారిస్తున్నాయి. న్యాయస్థానాల్లో కేసుల విచారణ సాగుతోంది. మోదీ ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటోంది. దీనిపై తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోంది.
*జగన్‌ నుంచి ప్రధాని మోదీకి ముడుపులు: బుద్ధా
తన అక్రమాస్తుల కేసుపై సీబీఐ ముందుకు వెళ్లకుండా తొక్కిపెట్టినందుకు ప్రధాని మోదీకి వైకాపా అధ్యక్షుడు జగన్‌ నుంచి ముడుపులు అందాయని మండలి విప్‌ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద వెంకన్న బుధవారం విలేకరులతో మాట్లాడారు.
*చంద్రబాబు నాయకత్వంలోనే జీవితాంతం: మంత్రి గంటా
రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జీవితాంతం పనిచేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టీకరించారు. వంగవీటి రాధా, యడం బాలాజీ తెదేపాలో చేరిన సందర్భంగా ఉండవల్లిలోని ప్రజావేదిక సమీపంలో నిర్వహించిన సభలలో మంత్రి మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ వివరణ ఇచ్చారు. జగన్‌ది నేర మనస్తత్వమని, నీతి, మానవత్వం ఆయనలో లేవని గంటా మండిపడ్డారు. పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారానికి దిగిన సాక్షి పత్రికను నమ్మొద్దని కోరారు. నేను సీఎం దగ్గర ఉంటే జగన్‌ వద్ద ఉన్నట్లు దుష్ప్రచారం చేశారని, నా మీదే ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటే మిగతా వాళ్ల సంగతేమిటని గంటా ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డి విలన్‌ మైండ్‌గేం అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటా పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి కూడా ఖండించారు. అవాస్తవాలు ప్రసారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దని, మీడియా హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు. అసత్యాలు ప్రసారం చేయడమే సాక్షి దినచర్య అని విమర్శించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com