Movies

అయిదుగురు హీరోయిన్లతో హారర్ సినిమా

అయిదుగురు హీరోయిన్లతో హారర్ సినిమా

సినిమాలో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు ఉండటం సాధారణమే. కానీ ఐదుగురు హీరోయిన్లతో ఓ సినిమా రూపొందడం అరుదనే చెప్పాలి. కాజల్‌ అగర్వాల్‌, రెజీనా, రైజా విల్సన్‌, జననీ అయ్యర్‌తో పాటు ఇరాన్‌ నటి నోయారికా కథానాయికలుగా తమిళంలో ఓ హారర్‌ సినిమా తెరకెక్కుతోంది. డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. జుగల్‌బందీ ైస్టెల్‌లో మహిళా ప్రధాన కథాంశంతో సాగే హారర్‌ సినిమా ఇదని, ఐదుగురు కథానాయికల పాత్రలకు సమప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు డీకే పేర్కొన్నారు. అతీంద్రియ శక్తులు ఉండి వాటిని వినియోగించుకోలేని యువతిగా కాజల్‌ కనిపించగా.. ఆమెను అనుక్షణం వ్యతిరేకించే యువతిగా రెజీనా కనిపిస్తుందని దర్శకుడు అన్నారు. జననీ, రైజా, నోయారికా పాత్రలు ప్రయోగాత్మక పంథాలో ఉంటాయని వెల్లడించారు. ఇందులో మంచివారు ఎవరు?దయ్యం ఎవరన్నది ఉత్కంఠను పంచుతుందని తెలిపారు. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌నుపూర్తిచేశారు. త్వరలో టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌లను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.