Kids

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా-TNI కోవిద్ బులెటిన్

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా-TNI కోవిద్ బులెటిన్

* తూ:గో: సీనియర్ రాజకీయ నేత బొడ్డు భాస్కర రామారావు మృతి…కోవిడ్ చికిత్స పొందుతూ విశాఖపట్నం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూసిన బొడ్డు..

* కరోనా సోకి అనారోగ్యం క్షీణించి ప్రాణాలు పోవడమే కాదు. కరోనా భయమూ ప్రాణాలు తీస్తోంది. నిజామాబాద్‌లోని రెంజల్‌ ఘటన మరువకముందే ఖమ్మం జిల్లాలోనూ అదే తరహా ఘటనలు వెలుగుచూడటం విషాదకరం. మహబూబాబాద్‌కు చెందిన ఆనందాచారి కొద్ది రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం రాగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. పాత బస్టాండ్‌లోని పరీక్షా కేంద్రానికి వెళ్లి వేచిచూస్తూ అక్కడే మృతిచెందాడు.

* ఒడిశాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. మే 5వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రవాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఒడిశా  ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. కూరగాయల కోసం ఇంటి నుంచి కేవలం 500 మీటర్లలోపే సంచరించాలని, ఆ దుకాణాలు కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే  తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది. ఇతర నిత్యావసరాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

* ‘హాయ్‌.. నేను చిరంజీవిని మాట్లాడుతున్నానయ్యా.. నీ ఆరోగ్యం బాగోలేదని తెలిసింది.. నేను పెద్ద డాక్టర్‌ గారితో మాట్లాడా.. తగ్గిపోతుందని చెప్పారు..’ అంటూ ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కరోనాతో చికిత్స పొందుతున్న తన అభిమానితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంబాజీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి చిరంజీవి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన ఆరోగ్యంపై శనివారం ఆరా తీశారు. కాకినాడలోని ఆసుపత్రి ప్రధాన వైద్యుడితో స్వయంగా చరవాణిలో మాట్లాడారు. అనంతరం తన అభిమానితో కూడా కొద్దిసేపు మాట్లాడి మనోధైర్యం కల్పించారు.

* ఇంటర్‌మీడియట్‌ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నాం. – ఆదిమూలపు సురేష్