సౌందర్యది ఆడిగేదాన్ని

90ల్లో అగ్రకథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్యకృష్ణ. ఇప్పుడు సినిమాల్లో ఏదన్నా పవర్‌ఫుల్‌ పాత్ర ఉందంటే.. వాటికి రమ్యకృష్ణే న్యాయం చేయగలదన్న పేరును సంపాదించుకున్నారు. ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి పాత్ర రమ్యకృష్ణ స్టార్‌డంను అమాంతం పెంచేసింది. ‘బాహుబలి’లో శివగామి పాత్ర రమ్యకృష్ణకు మరిన్ని ఆసక్తికరమై పాత్రలను తెచ్చిపెడుతోంది. త్వరలో విడుదల కానున్న ‘సూపర్‌డీలక్స్’ చిత్రంలో ఆమె పోర్న్‌స్టార్‌ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా రమ్యకృష్ణ ఓ ఆసక్తికరమై విషయాన్ని వెల్లడించారు. ‘నరసింహ’ సినిమాలో తాను నటించిన నీలాంబరి పాత్ర చేయడం మొదట తనకు ఇష్టంలేదని తెలిపారు. ‘నీలాంబరి పాత్ర చేయడం నాకు ఇష్టంలేదు. ఎందుకంటే నాకు తల పొగరు ఎక్కువగా ఉన్నట్లు ఆ పాత్రను తీర్చిదిద్దారు. అది కేవలం సినిమాలో పాత్ర మాత్రమేనని తెలుసు. కానీ దర్శకుడు ‘నీకు నీలాంబరి పాత్ర కావాలా? సౌందర్య పాత్ర కావాలా?’ అని అడిగి ఉంటే నేను సౌందర్య పాత్రే కావాలని చెప్పేదాన్ని. సినిమాలోనే నేను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డాను. కానీ దర్శకుడి విజన్‌ను నమ్మాను కాబట్టి ఆ పాత్రను చేయగలిగాను’ అని వెల్లడించారు రమ్యకృష్ణ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com