Health

కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు-TNI బులెటిన్

కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు-TNI బులెటిన్

* భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 3.5 లక్షలకుపైగా కేసులు, దాదాపు 3500 మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,57,229 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ  వెల్లడించింది. అయితే క్రితం రోజుతో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అంతకుముందు రోజు 3.68 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది.

* గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మరో 5 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ .పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కోవిషీల్డ్ టీకా డోసులు.

* ఏపీలో రేపటి నుంచి ఆటోలు, సిటీ బస్సులూ 12 వరకే- ఆ తర్వాత తిరిగితే సీజ్‌. ఏపీలో కరోనా కేసుల విజృంభణ దృష్ట్యా రాకపోకల నియంత్రణకు రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

* రానున్న రోజుల్లో ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసి అత్యవసర కోవిడ్ బాధితులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.

* సాధార‌ణ స్కూలు త‌ర‌గ‌తుల‌తో పోలిస్తే ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వ‌హ‌ణ త‌ల్లిదండ్రుల‌కు భారంగా మారిందని సుప్రీం కోర్టు పేర్కొంది. క‌రోనా కార‌ణంగా గ‌తేడాది నుంచి స్కూళ్ల‌న్నీ ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వ‌హిస్తున్న తరుణంలో స్కూళ్ల‌కు ఇంకా ఖ‌ర్చు త‌గ్గిందని సుప్రీం పేర్కొంది. కొవిడ్ కార‌ణంగా విద్యార్థుల త‌ల్లిదండ్రులు‌ ప‌డిన ఇబ్బందుల‌ను స్కూలు యాజ‌మాన్యాలు అర్థం చేసుకోవాల‌ని, ఆమేరకు వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించాల‌ని ఆదేశించింది. విద్యార్థుల‌కు అందించ‌ని వ‌స‌తుల‌కు కూడా ఫీజులు వ‌సూలు చేయ‌డం లాభార్జ‌నే అవుతుంద‌ని, అది మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది.