Movies

జూన్‌లో రెండోసారి

జూన్‌లో రెండోసారి

సమంత నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’. తాజా సమాచారం ప్రకారం జూన్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ను విడుదల చేయాలనుకుంటున్నారట. వేసవిలో విడుదల చేస్తామని దర్శక ద్వయం రాజ్‌ నిడమోరు, కృష్ణ డీకే గతంలో వెల్లడించారు. ఇప్పుడు ప్లాన్‌ మారిందట. మనోజ్‌ బాజ్‌పాయి, షరిబ్‌ హష్మి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించగా 2019లో విడుదలైన ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’కి సీక్వెల్‌ ఇది. రెండో సీజన్‌లోనూ వాళ్లందరూ ఉన్నారు. తొలి సీజన్‌లో పాత్రలకు తోడు కొన్ని కొత్త పాత్రలను జోడించారు. అందులో తీవ్రవాది రాజీగా నటించిన సమంత పాత్ర ఒకటి. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.