దేవాలయం అంటే పవిత్రమైనది గదా! దేవాలయం గాలిగోపురం మీద వివిధ భంగిమల్లో శృంగార శిల్పాలు వుండటం ఏమిటి? చూసేవారికి అసభ్యంగా వుండదా? అని మనకందరకూ అనిపిస్తుంది. దేవాలయాల మీద (గాలిగోపురం మీద) శృంగార శిల్పాలను నిర్మించటం వెనుక ఒక సునిశితమైన ఆలోచన వుంది. మరొక ప్రయోజనం కూడా వుంది. మన పూర్వీకుల జీవితం మన జీవితంలాగ అతివేగంగా (ఫాస్ట్‌గా వుండేది కాదు. నిశ్చలంగా, నిబ్బరంగా వుండేవారు. చాలామంది ప్రతిదినమూ దేవాలయానికి వెళ్ళి వస్తుండేవారు. పెద్దవాళ్ళతో పాటుగా యుక్తవయస్సులో వున్న వారు కూడా దేవాలయానికి ప్రతిదినమూ వెళ్ళి రావటం పరిపాటిగా వుండేది. పురుషుడైన ప్రతివాడు “ధర్మ –అర్థ – కామ – మోక్ష” అనే చతుర్విధ పురుషార్థాలనూ తప్పక సాధించుకోవాలనే నియమం వుండేది. మొదటిదిగా ధర్మసాధన చేయాలి. అంటే చదువుకోవటం గానీ, వృత్తి విద్య నేర్చుకోవటంగాని చేయాలి. రెండవది ధనాన్నిసంపాదించాలి. ధనమంటే ఈనాటి రూపాయినోట్ల కాదు. ఆ కాలంలో ఎవరికైనా ఎన్ని పశువులు వుంటే అంతటి ధనవంతులక్రింద లెక్క. మూడవది వివాహం చేసుకొని ఎక్కువమంది పిల్లల్ని కనాలి. ఎంతమంది సంతానం ప్రతి నిత్యమూ దేవాలయానికి వెళితే అంత గొప్పన్నమాట! నాల్గవది తెళుతూ దైవధానంలో పడి | చివరిగా మోక్షమార్గం అనుసరించి జీవితం సుశి కొరాన్ని విస్తరించ| ముగించాలి. ఈ “నాలింటిని పుణ్యపరు కూడదన్న హెచ్చరిక చేయు (పుణ్యపు టానికీ దేవాలయులమీద షార్గాలు అంటారు. మనిషికి ఈ నాలుగు శృంగార శిల్పాలను నిర్మించే అవసరమే. “కామిగాక మోక్ష చారు మన పూర్వీకులు, కామిగాడు” అంటాడు వేమన. మనం తెల్సు కోవల్సిన విషయం ఇంకొకటి కూడా వుంది. శృంగారం పాపకార్యం కాదు. సృష్టికి మూలం శృంగారమే గదా! అంతేకాదు; మనం భార్యలతో కలసివున్న దేవుళ్ళనే పూజిస్తుంటాం. మనం చదివే మంత్ర శ్లోకాలలో కూడా శృంగారం వుంది గదా! ధర్మం ఎంత గొప్పదో శృంగారమూ అంతే! సంపాదన ఎంత ముఖ్యమైనదో శృంగారమూ అంతే! మోక్షమెంతటి గొప్పదో శృంగారమూ అంతే! వశిష్ణాది మహాబ్రహ్మరులకు కూడా భార్యాబిడ్డలు వున్నారన్న విషయం విస్మరించకూడదు. భార్యతో కూడిన సృష్టి కార్యం పవిత్ర ధర్మంగా గుర్తించాలి. కాని పరస్త్రీ వ్యామోహం మాత్రమే మహాపాపం.
దేవాలయాలపై ఆ బొమ్మల వెనుక అర్థం ఏమిటి?
Related tags :