తెలంగాణలో భూమి ఉండి విదేశాల్లో ఉంటున్న ప్రవాసీయులు ఇక్కడకు రాకుండానే తమ భూమిని విక్రయించుకునే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీనికోసం ధరణి పోర్టల్లో ప్రత్యేక ఐచ్ఛికాన్ని గురువారం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసుపుస్తకం పొందిన ప్రవాసీయులు ఆ భూమిని తమ తరఫున విక్రయించేందుకు వేరొకరికి సాధారణ హక్కు (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ-జీపీఏ) కల్పించాల్సి ఉంటుంది. పోర్టల్లో దరఖాస్తు చేసి వచ్చే జీపీఏ నంబరు ఆ వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఆధారంగా భూమి విక్రయించవచ్చు. లేదా బహుమతిగా ఇవ్వవచ్చు. ధరణిలో స్లాటు నమోదు చేసుకుని భూ యజమాని తరఫున రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జీపీఏ నంబరు పొందిన వ్యక్తి హాజరుకావాలి.
తెలంగాణా ప్రవాసులకు ప్రభుత్వం శుభవార్త
Related tags :