Movies

నమిత థియేటర్ ప్రారంభం

నమిత థియేటర్ ప్రారంభం

తెలుగు, తమిళ సినిమాలలో నటించి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ నమిత తన పేరుతో ఓటీటీ ప్రారంభించబోతోంది. కరోనా కారణంగా గత ఏడాది నుంచి థియేటర్స్ మూతపడటంతో ఓటీటీలకు బాగా ప్రధాన్యం పెరిగింది. కొన్ని సౌత్ అండ్ నార్త్ భాషలలోని సినిమాలు ఓటీటీలలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకుల్లో కూడా ఈ మధ్యకాలంలో ఓటీటీలకు బాగా ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ఆహా పేరుతో తెలుగు ఓటీటీని అందుబాటులోకి తీసుకువచ్చి సినిమాలతో పాటు టాక్ షోస్..వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సొంత ఏటీటీ, ఓటీటీల ద్వారా తన సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో సౌత్ హీరోయిన్ నమిత కూడా ‘నమిత థియేటర్’ పేరుతో ఓటీటీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా నమిత మాట్లాడుతూ.. మా ఓటీటీ ద్వారా చిన్న- మీడియం బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు.