WorldWonders

తమిళనాడులో 2వారాల లాక్‌డౌన్-TNI బులెటిన్

తమిళనాడులో 2వారాల లాక్‌డౌన్-TNI బులెటిన్

* దేశంలో కరోనా రక్కసి మరణమృదంగం కొనసాగుతోంది. నిత్యం లక్షల మందిపై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. తాజాగా ఒక్కరోజే 4వేలకుపైగా ప్రాణాలను బలి తీసుకుంది. దేశంలోకి కొవిడ్‌ ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  ఇక వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైనే కొత్త కేసులు నమోదవడం మహమ్మారి ఉద్దృతికి అద్దం పడుతోంది.శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,01,078 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.18కోట్లకు చేరింది.

* సందట్లో సడేమియా…. కరోనా లో కాసుల వేట ఎక్కువయ్యే…..అందు గలదు..ఇందు లేదను సందేహము వలదు…..ఎందెందు వెతికినా….. అధిక వసూళ్ల పర్వమే…..కరోనా మహమ్మారి రెండవ దశ ప్రభావంతో మధ్యతరగతి, పేద కుటుంబాలు, వృత్తిదారులు ఉపాధి కోల్పోయి విలవిల్లాడుతున్న వైనం ఒకపక్క.నిత్యావసర సరుకుల ధరలు ఎం ఆర్ పి ల కంటే అధిక ధరలు వసూలు చేస్తూ లాభార్జన ధ్యేయం గా వ్యాపారులు ఉరకలు వేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం అంటూ ఏవో మందులు కొనాలంటే అక్కడ కూడా ఎమ్మార్పీ ధరలు అమలు కావడం లేదు. ముద్రించిన ఎమ్మార్పీ ధరల కంటే సుమారుగా రెండు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన సామాన్య ప్రజలకు….”కావాలంటే తీసుకోండి… లేకుంటే మూసుకోండి”అన్న చందంగా నిర్లక్ష్య సమాధానాలే వ్యాపారస్తులు, మెడికల్ షాపు యజమానుల నుండి రావడంతో ప్రజలు విస్తుపోతున్నారు. లాక్ డౌన్ లో సడలింపు సమయం కొద్దిగా ఉండడంతో, లభించిన వస్తువులు, మందుల కొనుగోలుకు ప్రజలు బిజీబిజీగా పర్యటిస్తున్నారు. సమయం మించిపోతుందని ఆదుర్దా ఒకవైపు…. కావలసినవి దొరుకుతాయో లేదో అనే ఆరాటం మరోవైపు గా ఈ లాక్ డౌన్ లో నిత్యం సామాన్యుల పోరుబాట ఇది.ఒక షాపు, ఒక ప్రాంతం కాదు, ప్రతి చోటా ఇదే తీరు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టకపోతే, సామాన్యుల జీవితాలు మరింత దోపిడీకి గురి అవుతాయి అని పలు ప్రజా సంఘాలు, పలువురు సామాజిక వేత్తలు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.

* కరోనా కట్టడికి రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా లాక్​డౌన్ తరహా ఆంక్షలవైపు అడుగులు వేస్తున్నాయి.తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్​డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది.మే 10 నుంచి 24 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.

* కడప జిల్లాఎర్రగుంట్ల మండలం రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో కరోనా విలయతాండవం.ఈరోజు ముగ్గురు ఉద్యోగస్తులు కరోనా తో మృతి.గత పది రోజుల నుండి ఇప్పటి వరకు 14 మంది ఉద్యోగస్తులు మృతి.ఆర్టీపీపీ లో అనధికారికంగా 200 మంది కరోనా పేషెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది.భయం భయంగా బతుకుతున్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉద్యోగస్తులు.హైదరాబాదు, కర్నూల్ ప్రాంతాల్లో ట్రీట్మెట్ తీసుకుంటూ మృతి.