కరోనా కారణంగా కన్నుమూసిన ప్రముఖ గాయకుడు జి.ఆనంద్‌కు పలువురు ప్రముఖులు అంతర్జాలంలో నివాళులర్పించారు. ఏడు దేశాలకు చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్ ఇండియా, శారద ఆకునూరి (అమెరికా) సంయుక్త ఆధ్వర్యంలో అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి శారద ఆనూరి నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంలో గాయకుడిగా, ‘స్వరమాధురి’ సంస్థ ద్వారా ఆనంద్ 6,500కు పైగా కచేరీలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. ఎందరో గాయనీ, గాయకులను తయారు చేసిన అలాంటి వ్యక్తి సరైన వైద్య సదుపాయం అందక మరణించడం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. జాతి సంపదలాంటి కళాకారులను కాపాడుకోవడానికి అలాంటి వారిని ప్రత్యేకంగా ఆదుకునే విధానం ఉండాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను, ఆనంద్‌తో ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు.
గాయకుడు ఆనంద్‌కు ప్రవాసుల నివాళి
Related tags :