* రేపటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పు. తెలంగాణలో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రేపటి(గురువారం) నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్‌లో 50శాతం సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి.
* బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుచమురు కంపెనీలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి.వరుసగా మూడో రోజు బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెంచాయి.పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.05, డీజిల్ రూ.82.61కు చేరింది.దేశ రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.98.36, డీజిల్ రూ.89.75, చెన్నైలో రూ.93.84, డీజిల్ రూ.87.49, కోల్‌కతాలో రూ.92.16, డీజిల్ రూ.87.45, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.95.67, డీజిల్ రూ.90.06, రాజస్థాన్ జైపూర్‌లో పెట్రోల్ రూ.99.31, డీజిల్ రూ.91.98, భోపాల్‌లో పెట్రోల్ రూ.100.08, డీజిల్ రూ.90.05కు చేరాయి.ఈ నెలలో చమురు ధరలు పెరుగడం ఇది ఏడోసారి.
* మందుబాబుల ముందు చూపు మామూలుగాలేదు. సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ప్రకటించడంతో లిక్కర్దొరకదేమోనని కంగారు పడిపోయారు. లాక్ డౌన్ బ్రేకింగ్న్యూస్ రాగానే సంచులు తీసుకుని మద్యం దుకాణాలవద్దకు పరుగులు తీశారు. పది రోజులకు సరిపడా సరుకుపట్టుకెళ్లారు. మే నెలలో 10వ తేదీ వరకు రోజుకు దాదాపురూ.61 కోట్ల సరకు అమ్మితే.. నిన్న రూ.125 కోట్లఅమ్మకాలు జరిగాయి. రోజూ ఉదయం 6 నుంచి 10వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉండనున్నాయి.
* ప్రముఖ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మన దేశంలో గత 24 సంవత్సరాలుగా వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతో సహాయం చేస్తుంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషికి మద్దతుగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారతదేశం అంతటా 10 తాత్కాలిక ఆసుపత్రులకు సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. స్థానిక ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇది జరుగుతుంది. ఈ అసోసియేషన్‌లో భాగంగా, ఈ కీలకమైన కాలంలో వైద్య మౌలిక సదుపాయాల కొరకు ఎల్జీ 5.5 మిలియన్ డాలర్ల(రూ.40 కోట్ల) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
* దేశంలో కరోనా విజృంభణ కారణంగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సంస్థ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 31 వరకు ఉన్న వాహనాల వారంటీ, ఉచిత సర్వీసుల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ తమ వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకటన చేసినట్లు పేర్కొంది. టాటా మోటార్స్ ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 31, 2021 నుంచి 2021 మే 31 మధ్య కాలంలో ముగియనున్న ప్రయాణీకుల కార్ల వారంటీ, ఉచిత సర్వీసుల కాలాన్ని ఇప్పుడు 2021 జూన్ 30 వరకు పొడగించింది.