నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉండాలనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తానని అంటోంది ప్రగ్యాజైస్వాల్. నేర్చుకోవడం ఆగిపోతే జీవితంలో ఎదగలేమని చెప్పింది. తెలుగు సినిమాలకు మూడేళ్ల పాటు దూరమైన ఆమె బాలకృష్ణ ‘అఖండ’తో పునరాగమనం చేయబోతున్నది. కరోనా ప్రభావంతో సినిమా చిత్రీకరణ నిలిచిపోవడంతో ముంబయి చేరుకున్న ఈ సొగసరి లాక్డౌన్ విరామాన్ని కుటుంబంతో గడుపుతోంది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రగ్యాజైస్వాల్ అభిమానులతో ముచ్చటించింది. ‘ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్‌లకు హాజరవుతున్నా. నటన, సాంకేతిక పరంగా సినిమాల్లో వస్తోన్న కొత్త అంశాలకు సంబంధించి పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నా. అలాగే తెలుగు భాష నేర్చుకుంటున్నా. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వర్కవుట్స్ ఉత్తమమైన మార్గమని నేను భావిస్తా. జిమ్‌తో పాటు యోగా, ధ్యానానికి ప్రతిరోజు సమయాన్ని కేటాయిస్తున్నా. విరామం దొరికితే పుస్తకాలు చదువుతుంటా. రోండా బైర్న్ రచించిన ‘సీక్రెట్’ నాకు ఇష్టమైన రచన. ప్రస్తుతం ఆమె ఇతర పుస్తకాల్ని చదువుతున్నా. పుస్తక పరిజ్ఞానం జీవితాన్ని ఉన్నతంగా మలచుకోవడానికి దోహదపడుతుందని నమ్ముతాను. కఠిన సమయాల్లో వ్యతిరేక ఆలోచనల్ని మనసులోకి రానీయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకే కుటుంబసభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతున్నా. డ్యాన్స్ చేస్తూ సంగీతం వింటూ మానసిక ఒత్తిడుల నుంచి సాంత్వన పొందుతున్నా’ అని తెలిపింది.
“సీక్రెట్” రచన
Related tags :