ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలను మే 9న అంతర్జాలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వివిధ రంగాలలోని ప్రముఖులైన మాతృమూర్తులు హాజరయ్యారు. డాక్టర్ కల్పలత గుంటుపల్లి, డాక్టర్ హేమ కొర్లకుంట్ల, సంధ్య గవ్వ, లలిత మూర్తి కుచిభొట్ల, గీత దమన్న, అన్నపూర్ణ నెహ్రు, రాజ్యం రావు ముఖ్య అతిథిలుగా పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమన్ని అనురాధ సిరిగిని ఉత్సాహంగా నిర్వహించారు. తల్లిగా, గ్రుహిణీగా, వృత్తిపరంగా తమ జీవితంలో ఎదురైన సవాళ్లు వాటిని దాటిన నేర్పుపై ప్రసంగించారు. టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, వనితా వేదిక సమన్వయకర్త నీరజా కుప్పాచి తదితరులు అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.
టాంటెక్స్ ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు
Related tags :