Fashion

మీ కార్యాలయాల్లో ఇలాంటివారితో జాగ్రత్తగా ఉండండి

మీ కార్యాలయాల్లో ఇలాంటివారితో జాగ్రత్తగా ఉండండి

మనం పనిచేసే వాతావరణం లో అనేక మనస్తత్వాలున్న అనేకమంది పనిచేస్తుంటారు. పైకి అంతా నవ్వుతూ ఆనందంగా కనబడుతుంటారు కానీ అంతర్గతంగా రకరకాలుగా ఉంటారు.అందులో సానుకూల దృక్పథం ఉన్నవారితో కలిసి పనిచేయడం ఎంత ఆనందమో వ్యతిరేక దృక్పథం ఉన్న వాళ్ళతో సర్దుకు పోవడం అంత సులభం కాదు. వీరందరితో సర్దుకుపోతూ పనిచేయడం అంత సుళువైన విషయం కాదు. ముందుగ విభిన్న రకాల వ్యతిరేక దృక్పథం ఉన్న మనుష్యులను ముందుగా అర్ధం చేసుకుందాం.

1.COMPLAINERS( ఫిర్యాదిగాళ్ళు):
—————————————- వీరు తరుచూ అన్ని విషయాల పట్ల, అందరివ్యక్తులపై తీవ్ర అసంతృప్తితో ఉండి వారిలోని లోపాలను నిత్యం కనబడే ప్రతీవారికి ఫిర్యాదు చేస్తుంటారు. కోడిగుడ్డు పై వెంట్రుకులుతీసే పనిలో నిత్యం ఆనంద పడుతుంటారు.

2, BACKSTABBERS (వెన్నుపోటుగాళ్ళు)
—————————————- వీరు మన ఎదుట చాలా మంచిగా నటిస్తూ ఉంటారు కాని సమయం చూసి మన అంచనాకు ఏ మాత్రం అందకుండా దొంగదెబ్బ తీస్తారు.వీరి వినమ్రత, నక్క వినయాలు చూసి వీరిపై పూర్తిగా ఆధారపడ్డామా అడ్డంగా దొరికిపోతాం.

3.CONTROLLERS: (రిమోట్ గాళ్ళు):
———————————— మన స్వంత విషయాల్లో గాని ఇతర విషయాల్లో గాని అధికంగా జోక్యం చేసుకుంటూ మనపై ఆధిక్యం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ తమ నియంత్రణలో ఉండాలనే భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు.

4.CLAMS : (దాగుడుమూతగాళ్ళు)
—————————————- వీరు ప్రతీ పని చాలా రహస్యంగా చేస్తుంటారు. తమ విషయలు ఎవరితో పంచుకోవడం గాని నలుగురికి చెప్పడం గాని ఎప్పుడు చేయరు. ఆఖరికి వాళ్ళ అబ్బాయి పెళ్ళి నిర్ణయించబడిన విషయం పక్కింటివారికి కార్డు ఇచ్చినంతవరకు కూడా తెలియనీయరు.

5.SLUFFERS (పనిదొంగలు) —————————-వీరు ఏ మాత్రం అనుకున్న సమయనికి లేదా వస్తామన్న సమయానికి ఎప్పుడూ రారు.పని చేయాల్సివస్తే ఇలా కనబడి అలా మాయమైపోతారు. పనిపూర్తయ్యాక తప్పనిసరిగా కనబడతారు. వీరిని నమ్ముకొని ఏ పని మొదలెట్టినా పనంతా మనం చేసుకోవలసి వస్తుంది లేదా అనుకున్న పని వీరి మూలంగా వాయిదా పడే పరిస్థితి తలెత్తుతుంది.

6. GOSSIPERS 🙁 పుకారుగాళ్ళు)
—————————-వీరికి లేనిపోని, పనికిమాలిన అనవసర కబుర్లతో కాలక్షేపం చేయడమంటే వీరికి చాలా ఇష్టం.నిత్యం ఎవరిగురించో గాలికబుర్లు ప్రచారం చేస్తుంటారు. ఎవరినైనా ఎత్తెయ్యాలన్నా, ముంచెయ్యాలన్నా వీరికి క్షణంలో పని.

7.WALKING WOUNDED: ( క్షతగాత్రులు) :
—————————జీవితంలో అనేక విషయాల్లో ఎదురుదెబ్బలు తినడం వలన ప్రపంచం లోని సమస్యలన్నీ వీరికే ఉన్నట్టు తల వేలాడేసుకుంటూ పనిచేస్తుంటారు. తాము ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ ఒక్కరే పనిభారం తమపై వేసుకొని ఒకరితో సంబంధం లేకుండా పనిచేస్తుంటారు.

8.NEGATIVES: (రంధ్రాన్వేషణగాళ్ళు) —————————–వీరు ప్రతీ విషయంలో నెగటివ్ ఏముందో దానిని వెతకడానికి ప్రయత్నిస్తుంటారు. నిరాశవాదంతో తెగ నలిగిపోతూ ఎవడూ సుఖంగా లేకుండా అందరిలో గాలి తీస్తుంటారు.

9.BROWN NOSERS (చంచాగాళ్ళు)
—————————————- ఎలాంటివారినైనా పొగడ్తలతో తెగ పొగిడి తమ పని కాకా పట్టి చేయించుకుంటుంటారు.పనిపూర్తయినంతవరకు తెగ పాలిష్ చేస్తుంటారు.

10.SNIPPERS ( దొంగదెబ్బగాళ్ళు )
—————————————-
పైకి మంచిగా కనబడినా చాటుగా గోతులు తెగ తీస్తుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ దొరకరు. అకస్మాత్తుగా దాడిచేయడం లో సిద్ధహస్తులు.

11.WHINERS ( ఏడుపుగొట్టు గాళ్ళు) :
—————————————- ఎప్పుడు ఇతరుల ఉన్నతిని , విజయాలను చూసి ఏడిచేవాళ్ళు. అందరూ బాగున్నారు కాని తాము మాత్రమె ఎదగాలేకపోతున్నాం అంటూ తెగ బాధపడుతుంటారు. ఎపుడు ఇతరుల పై అసూయ తొ ఉంటూ ఉండేవాళ్ళు.

12. EXPLODERS (పటాష్ గాళ్ళు)
—————————వీరికి వ్యతిరేకంగా ఏమి జరిగినా వీరు అనుకున్నట్టు వీరికి ఏ మాత్రం అనుకూలంగా జరగకపోయినా పటాష్ లా ఫట్ మని బద్దలై బీభత్సం సృష్టిస్తారు. వీరితో పెట్టుకోవడం చాలా ప్రమాదం అని అందరూ అనుకునేలా నోరు వేసుకొని మీద పడుతుంటారు.

13. PATRONIZERS (వకల్తా గాల్లు)
—————————వీరు ఎప్పుడు తమ గురించి కాకుండా ఇతరుల గురించి వకల్తా తీసుకొని మాట్లాడుతుంటారు. వారికి సంబంధం లేకపోయినా ఇతరులగురించి వీరు తెగ ఫీలైపోతుంటారు.

ఈ ?పై మనస్తత్వంతో ఉన్న వీరిని ఎలా సంస్కరించాలనే ఆలోచనలొద్దు. వీరినుండి మనం మనల్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచిద్దాం. దారిలో ముళ్ళుంటే అవన్నీ ఏరుకొని కూర్చుంటామా, కాళ్ళకు మంచి చెప్పులు వేసుకుంటే సరిపోలా?…