DailyDose

CI కొడుకుని కూడా వదలని చిత్తూరు పోలీసులు-నేరవార్తలు

CI కొడుకుని కూడా వదలని చిత్తూరు పోలీసులు-నేరవార్తలు

* లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెబుతున్న చిత్తూరు జిల్లా, పలమనేరు సీఐ జయరామయ్య కన్నకొడుక్కే ఫైన్ వేశారు. పలమనేరులో ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో కానిస్టేబుల్ ఓ యువకుడిని తీసుకువచ్చారు. అతను బయట తిరుగుతున్నాడని సీఐకి చెప్పారు. తీరా చూస్తే ఆ యువకుడు సీఐ కుమారుడు రాహుల్‌గా గుర్తించారు. కన్నకొడుకు అయినా తప్పు చేస్తే శిక్షించాల్సిందేనంటూ రూ. 125 ఫైన్ వేశారు. అంతే కాకుండా మరోసారి బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

* వరంగల్ రూరల్ నర్సంపేట మండలం కాకతీయనగర్ సమీపంలోని 601 సర్వే నంబర్ అసైన్డ్ భూమి లో గత నెల రోజుల నుండి గుడిసెలు వేశారని గుర్తు తెలియని వ్యక్తులు గుడిసెలకు నిప్పంటించి అందులో ఉన్న వారి పై విచక్షణ రహితంగా దాడి చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది విషయం తెలుసుకున్న పోలీసులు సిబ్బందితో గుడిసెల వద్దకు చేరుకొని వివరాలు తీసుకుంటున్నారు గుడిసె వాసులు చెప్పే కథనం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా పై కర్రలతో దాడికి దిగారని మా గుడిసెలకు నిప్పంటించి మాపై దాడి చేశారని తెలియజేశారు విషయం తెలుసుకున్న ఫైర్ అధికారులు తగలబడుతున్న గుడిసెలను మంటలు ఆర్పు తున్నారు పూర్తి వివరాలను నర్సంపేట యస్ఐ నవీన్ కుమార్ సేకరిస్తున్నారు

* కంచికచర్ల మండలం పరిటాల, దొనబండ క్వారీ యజమానులకు ఉన్న రూల్స్ ప్రకారం కాకుండా అక్రమాలకు పాల్పడుతున్నారన్న కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలోనే బ్లాస్టింగ్ చేయాలన్న ఎస్పీ. కొంత మంది ఎటువంటి పర్మిషన్లు లేకుండా రాత్రి సమయంలో కూడా బ్లాస్టింగ్ కి పాల్పడుతున్నారన్న ఎస్పీ.

* పెద్దాపురం ఎడిబి రోడ్డు ఇండ్రస్టీయల్ ఏరియా వద్ద లారీని ఢీకొట్టిన గృహ శంఖుస్థాపన కు వెళ్తున్న కారు….నలుగురు మృతి…మృతుల్లో ఐదు నెలల చిన్నారి…కారులో ఇరుక్కున్న ఐదుగురిని బయటకు లాగి ఆసుపత్రికి తరలించిన పెద్దాపురం పోలీసులు…తాళ్ళరేవు మండలం పెద్ద వలస నుండి రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రమాదం.