Business

పోస్టల్ శాఖ ముఖ్య ప్రకటన-వాణిజ్యం

పోస్టల్ శాఖ ముఖ్య ప్రకటన-వాణిజ్యం

* తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. నేడు రెండో రోజు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక ఈ లాక్‌డౌన్‌ పది రోజుల పాటు (మే 21) వరకు కొనసాగుంది. ఈ లాక్‌డౌన్‌ కాలంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లో వినియోగదారులకు అందించే సేవలకు సంబందించి తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసు కార్యాలయాల కౌంట‌ర్లు ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్రమే పని చేయనున్నట్లు తెలిపింది. చిన్న పోస్టాఫీసులు మాత్రం ఉద‌యం 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రమే ప‌నిచేస్తాయ‌ని అధికారులు తెలిపారు. ఉత్తరాల డెలివరీ తదితర సేవలు మాత్రం ఎప్పటిలాగే కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళల్లో కూడా మార్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 గం‍టల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. అదే విధంగా అన్ని కోవిడ్‌ జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ 50 మంది సిబ్బందితో బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగానున్నాయి.

* కరోనా విపత్కర పరిస్థితుల్లో తనవంతు సాయం చేయటానికి గరుడవేగ సంస్థ ముందుకు వచ్చింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎక్కడ కొనుగోలు చేసినా వాటిని ఇండియాలోని తమ వారికి వాటిని నేరుగా అందిచాలని అనుకుంటే, వెంటనే తమను సంప్రదించాలని (www.garudavega.com) గరుడవేగ సంస్థ ప్రకటించింది.

* దేశంలో చమురు ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రజల ఆసక్తికి అనుగుణంగా మార్కెట్లోకి కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా స్వీడిష్ కి చెందిన ఆస్ట్రియన్ కంపెనీ హుస్క్వర్నా మోటార్ సైకిల్స్ కూడా వచ్చి చేరింది. ఈ సంస్థ 2018 సంవత్సరంలో 6.7-హెచ్‌పీ మినీబైక్‌ను ఆవిష్కరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ-పీలెన్ అనే బైక్‌తో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల విభాగంలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది.

* కోవిడ్‌-19 ప్ర‌జ‌ల ఆరోగ్యాన్నే కాకుండా ఆర్థిక ప‌రిస్థితిని దెబ్బ‌తీసింది. ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డం, సంస్థలు వేత‌నాలు త‌గ్గించ‌డం, వ్యాపారాలు మూత‌ప‌డ‌డం/స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో చాలా మంది ఆదాయం త‌గ్గింది. దీంతో తీసుకున్న రుణాల‌ను ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం చెల్లించాల‌నుకున్న వారు కూడా స‌రైన స‌మ‌యానికి రుణాలు చెల్లించ‌లేక‌, ఆర్థికంగా ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఇలాంటి ఇబ్బందుల‌ను మీరు ఎదుర్కుంటున్నారా? ఇటువంటి ప‌రిస్థితులలో రుణాల‌ను స‌రిగ్గా నిర్వ‌హించేందుకు ఒక ప్ర‌ణాళిక అవ‌స‌రం. ముఖ్యంగా ఒత్తిడికి గురుకాకుండా మ‌నోధైర్యంతో ఉండాలి. నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం క‌ష్ట స‌మ‌యంలో రుణాల‌ను తెలివిగా మేనేజ్ చేయాలి. ఇందుకు రెండు స్ట్రాట‌జీలు ఉన్నాయి. మొద‌టిది చాలా మంది సాధార‌ణంగా అనుస‌రించే స్ట్రాట‌జీ.. వ‌డ్డీ ఆధారంగా రుణాల‌ను రెండు భాగాలుగా విభ‌జించ‌డం. ఈ విధానంలో అధిక వ‌డ్డీ రుణాల‌ను ఒక కేట‌గిరికి, త‌క్కువ వ‌డ్డీ రుణాల‌ను మ‌రొక కేట‌గిరిలోకి తీసుకుంటారు. ముందుగా అధిక వ‌డ్డీ రుణాల‌పై దృష్టి సారించాలి. ఉదాహ‌ర‌ణ‌కు క్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాల‌లో అధిక వ‌డ్డీ రేట్లు ఉంటాయి. ముందుగా వీటిని క్లియ‌ర్ చేయాల్సి ఉంటుంది. దీంతో వ‌డ్డీ రూపంలో ఎక్కువ మొత్తం బ‌య‌టికి పోకుండా ఉంటుంది. అధిక వ‌డ్డీతో కూడిన రుణాల‌ను ముందుగా తీర్చ‌డం వ‌ల్ల చేతిలో ఎక్కువ మొత్తం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తుంటారు. ఇది కొంత మంది విష‌యంలో ప‌నిచేస్తుంది.